వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

ఒత్తయిన జుట్టును ఎవరు కోరుకోరు చెప్పండి.స్త్రీలే కాదు పురుషులు కూడా తమ జుట్టు ఒత్తుగా ఉండాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.

కానీ ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, తల స్నానం సమయంలో చేసే పొరపాట్లు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్( Hair growth ) అనేది ఆగిపోతుంది.దీంతో ఉన్న జుట్టు ఊడుతుంది.

కానీ కొత్త జుట్టు రాదు.ఫలితంగా జుట్టు పల్చగా మారిపోతుంది.

మీకు ఇలా జరుగుతుందా.? అయితే వర్రీ వద్దు.

If You Follow This Remedy Once A Week For Thick Hair Home Remedy, Hair Care, H
Advertisement
If You Follow This Remedy Once A Week For Thick Hair! Home Remedy, Hair Care, H

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ను వారానికి ఒక్కసారి వేసుకుంటే వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.యాక్టివేటెడ్ చార్కోల్( Activated charcoal ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సౌందర్య సాధనలో చాలా మంది చార్కోల్ పౌడర్ ను వినియోగిస్తుంటారు.అయితే కేశ సంరక్షణకు కూడా యాక్టివేటెడ్ చార్కోల్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ వేసుకుని రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ముప్పై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

If You Follow This Remedy Once A Week For Thick Hair Home Remedy, Hair Care, H
Advertisement

యాక్టివేటెడ్ చార్కోల్ స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.అదే సమయంలో జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

వారానికి కేవలం ఒక్కసారి ఈ చార్కోల్ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే మీ జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.జుట్టు రాలటం త‌గ్గు ముఖం పడుతుంది.

చుండ్రు,( Dandruff ) స్కాల్ప్ ఇచ్చింగ్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

తాజా వార్తలు