రోజు నైట్ ఈ చిన్న చిట్కా పాటిస్తే ముఖం అద్దంలా మెరిసిపోతుంది!

చర్మంపై ఎటువంటి మచ్చ, మొటిమ లేకుండా ముఖం అద్దంలా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అటువంటి చర్మం కోసం తహతహలాడిపోతుంటారు.

కానీ, పెరిగిన కాలుష్యం, ఆహార‌పు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు తదితర అంశాలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఫలితంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాను ప్రతిరోజు నైట్ పాటిస్తే ముఖం అద్దంలా మెరిసిపోతుంది.చర్మంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.

మరి ఇంతకీ ఆ చిన్న చిట్కా ఏంటి అనేది లేట్‌ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక‌టిన్న‌ర‌ గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement

వాటర్ హీట్ అవ్వగానే అందులో అరకప్పు కడిగిన బియ్యాన్ని వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే కనుక చర్మంపై మొండి మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు ముఖ‌ చర్మం అద్దం మాదిరి అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.

Advertisement

స్కిన్ టోన్ సైతం మెరుగుపడుతుంది.కాబట్టి అందంగా మెరిసిపోవాలని ఆరాటపడేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు