ఈ కాయతో ఇలా చేస్తే పంటి సమస్యలు దూరమవుతాయా..

ప్రస్తుత సమాజంలోని ప్రజలకు పంటి సమస్యలు అధికమవుతున్నాయి.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువమంది అధిక చక్కెర పదార్థాలను ఉపయోగిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే నూటికి 80 శాతం మంది పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పంటి ఇన్ ఫెక్షన్,పిప్పి పన్ను వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అలాగే ఈ సమస్యలు ఉన్నవారికి పంటి మీద ఏనామిల్ దెబ్బతిని సెన్సిటివ్ గా మారే అవకాశం కూడా ఉంది.

ఈ పంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కరక్కాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కరక్కాయలో అరబింనో గెలాక్టిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండడంవల్ల నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.మార్కెట్లో కరక్కాయలు విరివిగానే లభ్యం అవుతుంది.

Advertisement
If You Do This With This Nut, Will The Tooth Problems Go Away Toothache, Gingivi

అలాగే కరక్కాయ పొడి కూడా ఎక్కువగా దొరుకుతుంది.కరక్కాయ పొడి తో నోట్లో వేలుతో కానీ బ్రష్ తో కానీ బ్రష్ చేసుకుంటే నోటిలో ఉండే బ్యాక్టీరియా నశించి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి పళ్ళను తోముకుంటే పనులకు సంబంధించిన చాలా సమస్యలు దూరం అవుతాయి.పూర్వ కాలంలో అప్పటి ప్రజలు దంత సమస్యలకు ఎక్కువగా కరక్కాయను వాడేవారు.

దానితో అప్పటి ప్రజలకు పంటి సమస్యలు చాలా తక్కువగా ఉండేవి.

If You Do This With This Nut, Will The Tooth Problems Go Away Toothache, Gingivi

కరక్కాయ పొడి లేదా పేస్ట్ తో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పిప్పి పన్ను, నోటిలో బ్యాక్టీరియా తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.కాబట్టి కరక్కాయను వాడి పంటి సమస్యల నుండి సులభంగా తగ్గించుకోవచ్చు.అందువల్ల చాలామంది పంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ విధంగా ఉపయోగించి పంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు