క్యారెట్ తో ఇలా చేస్తే.. మీ అందం రెట్టింపు కావడం ఖాయం..!

క్యారెట్ ( Carrot )మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మందికి తెలుసు.

అలాగే క్యారెట్ ను వంటకాల్లో జ్యూస్ తయారీలో, సాలాడ్స్ ల కూడా తీసుకోవచ్చు.

క్యారెట్ ఎలా తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.కనీసం రోజుకు ఒక క్యారెట్ తిన్నా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి క్యారెట్ లో విటమిన్ ఏ, సి లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

విటమిన్ ఏ కారణంగా మన కంటి చూపు మెరుగుపడుతుంది.వయసు పెరిగేకొద్దీ వచ్చే కంటి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది.

రక్తహీనతను( Anemia ) కూడా క్యారెట్ దూరం చేస్తుంది.క్యారెట్ ఆరోగ్యానికే కాకుండా చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే క్యారెట్ ను ఫేస్ ప్యాక్ రూపంలో తీసుకుంటే మన అందం రెట్టింపు అవుతుంది.మరి క్యారెట్ తో అందన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల క్యారెట్ రసం( Carrot juice ), నాలుగు నిమ్మరసం చుక్కలు, కొద్దిగా బనానా గుజ్జు, కోడి గుడ్డు వైట్ సోనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం అంత రాసుకుని ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ చిట్కాను పాటించడం వల్ల ముఖం మెరవడంతో పాటు ముఖంపైనీ ముడతలు( Wrinkles ) కూడా దూరమవుతాయి.

ఇంకా చెప్పాలంటే రెండు స్పూన్ల క్యారెట్ రసాన్ని ఒక చిన్న బౌల్ లోకి తీసుకొని అందులో కొద్దిగా బొప్పాయి ( Papaya )గుజ్జును మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత దీన్ని ముఖమంత రాసుకొని ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి.ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.ఇంకా చెప్పాలంటే క్యారెట్ తో ఆరోగ్యాన్ని కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటించి ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు