దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బిఆర్ఎస్( BRS) సర్కార్ రైతుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చింది.ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, కొనుగోలు కేంద్రాలు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతోంది.
ఇదే తరుణంలో కేసీఆర్( KCR ) సర్కార్ రైతుల ఓట్ల ద్వారా రెండు పర్యాయాలు గద్దెనెక్కింది.ఈసారి కూడా గద్దెనెక్కి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
ఇదే తరుణంలో మరో కొత్త పథకంతో రైతులను ఆకర్షించేందుకు కేసిఆర్ సర్కార్ నయా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ఈ పథకం వర్కౌట్ అయితే మాత్రం కెసిఆర్ తప్పక హ్యాట్రిక్ కొడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇంతకీ ఆ పథకం ఏంటి వివరాలేంటో పూర్తిగా చూద్దాం.
కెసిఆర్ స్ట్రాటజీలు ఎవరికి అర్థం కావు.
ఆయన ప్రజెంట్ రాజకీయం గురించి ఎప్పుడు ఆలోచించరు.ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించే ఎక్కువగా అంచనా వేసుకొని ఉంటారు.
అలాంటి కెసిఆర్ ఎత్తులకు పైఎత్తులు వేయాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు.కానీ ఈసారి బిఆర్ఎస్ కు పోటిగా కాంగ్రెస్ ( Congress ) గట్టిగా ఎదిగింది.
ఎంతో కొంత బిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించేలా కనిపిస్తోంది.

ఇదే తరుణంలో ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లకుండా కెసిఆర్ సరికొత్త స్కెచ్ తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.అదే రైతుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకు వస్తున్నారట.తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాల ఓట్లు సుమారుగా కోటికి పైగానే ఉంటాయి.
ఈ ఓట్లన్నీ బిఆర్ఎస్ వైపు మల్లాలి అంటే తప్పనిసరిగా ఈ పథకాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది.ఇంతకీ ఆ పథకం ఏంటయ్యా అంటే రైతులకు పెన్షన్( Pension for Farmers ).

ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా( Raithu bheema ) ,రుణమాఫీ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులకు బాసటగా నిలిచారు.ఈ తరుణంలోనే రైతుల కోసం రైతు పింఛన్ పథకాన్ని కూడా తీసుకురావాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.వచ్చే నెల 16వ తేదీన ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం అధికారికంగా బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది.ఒకవేళ ఈ పథకం అమలైతే మాత్రం కెసిఆర్ సర్కార్ తప్పనిసరిగా మూడోసారి అధికారంలోకి వచ్చినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.