ఎవరికైనా కొత్త ప్రదేశాలకు వెళ్తే మాత్రం అక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడతారు.అక్కడినుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ఎదురుచూస్తూ ఉంటారు.
ఉదాహరణకి మనమైనా సరే ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అస్సలు ఉండలేకపోతాం.అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతాం అని అనుకుంటుంటాం.
అలా ఇతరులైన సరే మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతారు.నిజానికి అందరికీ ఉండే సమస్య అదే.ఇక సినిమా నటీనటుల విషయంలో తీసుకుంటే మాత్రం.ఇతర ఇండస్ట్రీకి చెందిన నటులు మరి ఏదైనా ఇండస్ట్రీలో నటించినప్పుడు చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటారు.
చాలావరకు కొంతమంది నటులు బాగానే మూవ్ అయినప్పటికీ మరి కొంతమంది నటులు అంతగా మూవ్ అవ్వలేరు.
అలా తాజాగా బాలీవుడ్ కు చెందిన బ్యూటీ అటువంటి పరిస్థితినే ఎదుర్కొంది.
అది కూడా మన టాలీవుడ్ లో ఉండలేకపోయింది.ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.
నాగిని బ్యూటీ మౌని రాయ్.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ నటిగానే కాకుండా మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె చాలా వరకు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె డాన్స్ కూడా బాగా చేస్తుంది.
గతంలో ఓ డ్యాన్ షోలో కూడా ఫైనలిస్టుగా నిలిచింది.అలా మెల్లిమెల్లిగా వెండితెరపై అవకాశాలు అందుకుంది.
ఇక ఇటీవలే విడుదలైన బ్రహ్మస్త్రం సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది.అయితే ఈ సందర్భంగా మౌని రాయ్, రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోకి ఇటీవలె వచ్చారు.

ముందే అది సుమ షో.ఇక గల గల మాటలతో మాట్లాడే సుమ.తన దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే చాలు వాళ్లు సుమ మాటల్లో బంధీ కావాల్సిందే.అలా ఈ నలుగురు తొలిసారిగా క్యాష్ ప్రోగ్రామ్ కు రావడంతో ఎపిసోడ్ మొత్తం బాగా సరదాగా సాగింది.
కానీ మౌని రాయ్ మాత్రం ఆ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ కూడా సందడి చేసినట్టు కనిపించలేదు.బహుశా తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా రావడం వల్ల.ఈ ముద్దుగుమ్మకు ఇబ్బందిగా అనిపించిందేమో.అందుకే ఎపిసోడ్ పూర్తయ్యే వరకు ఎప్పుడెప్పుడు వెళ్లాలా అన్నట్లు ఉంది.
దీంతో ఈ బ్యూటీపై టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.తెలుగు షోకు రావడం ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

మరికొందరు అసలు ఆమె ఏంటి అలా ఉంది.కనీసం సుమ షో కు వచ్చినందుకైనా కాస్త తెలుగు ప్రేక్షకులతో ఏదో ఒక కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మొత్తానికి ఈ ఎపిసోడ్ బాగా సందడిగా సాగిన కూడా మౌని రాయ్ పట్ల నిరాశ చెందుతున్నారు తెలుగు ప్రేక్షకులు.