తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పేసారు.మళ్లీ తాను అదే నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుస్తానని ప్రకటించారు.
అసలు రఘురామకృష్ణంరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలుస్తానని ధీమా గా ఎలా చెప్తున్నారు అనేది అందరికి సందేహంగా మారింది.తనపై అనర్హత వేటు వేసే విధంగా వైసీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని, అంతకంటే ముందుగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడాన్ని బట్టి చూస్తే అనర్హత వేటు పడకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆయన రాజీనామా చేస్తున్నారనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది.
కాకపోతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ, ఆయన బిజేపి లో చేరి బీజేపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు.
ఈ విషయంపై రఘురామకృష్ణంరాజుకి క్లారిటీ ఉంది అందుకే ఆయన అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలని చెబుతున్నారు.అమరావతి నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు.ఆ విధంగా చేస్తే అమరావతి కి మద్దతుగా పోరాటం చేస్తున్న పార్టీల మద్దతు తప్పనిసరిగా ఉంటుంది అనే లెక్కల్లో ఉన్నారట.ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని టిడిపి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉండదని అమరావతి మద్దతుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి అని భావిస్తే, టిడిపి జనసేన పార్టీలో పూర్తిగా తనకే మద్దతు ఇస్తాయని రఘురామ నమ్ముతున్నారట.
అందుకే తాను రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకోగలిగితే మూడు పార్టీల మద్దతుతో సునాయాసంగా ఎంపీగా మళ్లీ గెలుస్తానని రఘురామ నమ్ముతున్నారట.ఈ విషయంపై టిడిపి కూడా ఆసక్తి చూపిస్తోందట.బీజేపీ అభ్యర్థిగా రఘురామ రంగంలోకి దిగితే ఆయనకు మద్దతు ఇవ్వడం ద్వారా బిజెపికి దగ్గరయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అని 2024 ఎన్నికల సమయం నాటికి జనసేన బిజెపి ,టిడిపి కాంబినేషన్ కు ఇది రెఫరెండం గా మారుతుందనే అంచనాలో ఉందట.