ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దిగితే.. జరిగేది అదే !

జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రచారం చేసి పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు తారక్.ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినప్పటికి ఎన్టీఆర్ చేసిన ప్రచారం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎన్టీఆర్ వాక్చాతుర్యం, పోలిటికల్ గా ఆయన మాట్లాడినా వ్యాఖ్యలు టిడిపి కార్యకర్తల్లో ఎనలేని జోష్ నింపాయి.ఇక అప్పటి నుంచి అడపా దడపా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరమైనప్పుడు అండగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించారు.

అయితే 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కనిపించలేదు.

Advertisement

అప్పటి నుంచి ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.చంద్రబాబే తారక్ ను పార్టీ కి దూరం చేశారని అనే వారు కూడా లేకపోలేదు.కారణాలు ఏవైనప్పటికి ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి దురమౌతూ వచ్చారు.

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత ఎన్టీఆర్ తిరిగి పార్టీలోకి రావాలని పార్టీ బాద్యతలు స్వీకరించాలని తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగానే డిమాండ్ చేశారు.అయితే చంద్రబాబు వీటిపై ఎప్పుడు స్పందించలేదు.

కానీ లోకేశ్ మాత్రం ఆ మద్య దీనిపై స్పందించారు.ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరారు.

దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేస్తే ఏం జరుగుతుంది అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ప్రస్తుతం పార్టీ పరిస్థితి గతంతో కొంత బలహీనంగానే ఉందని చెప్పాలి.

Advertisement

ఈ నేపథ్యంలో చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత లోకేశ్ కు పార్టీని నడిపించే సత్తా లేదని ఎన్టీఆర్ ఆ బాద్యతలు తీసుకోవడం వల్ల కనీసం పార్టీకి ప్రతిపక్ష హోదా అయిన దక్కుతుందని కొడాలి నాని వంటి వాళ్ళు విమర్శిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే పార్టీకి మైలేజ్ పరుగుతుందనే మాట వాస్తమే గాని, నారా లోకేశ్ ఇమేజ్ మాత్రం మసకబారుతుందనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే లోకేశ్ తో పోలిస్తే భాష విధానంలోనూ, పదునైన వ్యాఖ్యలు చేయడంలోనూ, ప్రజాకర్షణలోనూ ఎన్టీఆర్ చాలా ముందుంటాడు.

అందువల్ల చంద్రబాబు, లోకేశ్ ల కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది.దాంతో టీడీపీలో నారా వంశానికి ముగింపు పడి.నందమూరి వంశం ముందుకు వచ్చే అవకాశమే ఎక్కువ.కాబట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా ఇదే జరుగుతుందని కొందరి అభిప్రాయం.

మరి ఎన్నికల నాటికి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు