మైనంపల్లిపై వేటు తప్పదా.. ఆ సీటు కేసీఆర్ ఎవరికి ఇస్తున్నారంటే..?

మైనంపల్లి.మైనంపల్లి.

మైనంపల్లి .

ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా మైనంపల్లి హనుమంతరావు ( Mynampally Hanumanth Rao ) వ్యాఖ్యలే వైరల్ గా మారాయి.క్రమశిక్షణకు మారుపేరైన బిఆర్ఎస్ పార్టీ నుంచి మొదటిసారి తిరుగుబాటు రాగం బయటకు వచ్చింది.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హరీష్ రావు ( Harish rao ) పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా బిఆర్ఎస్ పార్టీ హై కమాండ్ కు తలనొప్పిగా మారింది.హరీష్ రావును టార్గెట్ చేసి విపరీతంగా మాటలు అన్నారు.

మెదక్ ని కీపా అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హరీష్ అన్న అభిమానులంతా దిష్టిబొమ్మలు దహనం చేశారు.

Advertisement

దీనిపై స్పందించిన హై కమాండ్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరి కెసిఆర్( Kcr ) మైనంపల్లి పై సస్పెన్షన్ వేటు వేస్తారా.లేదంటే సర్ది చెప్పి పార్టీలోనే ఉంచుకుంటారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.ఒకవేళ వేటు వేస్తే మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి ఇస్తారు.

పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యాల తర్వాత కేవలం హరీష్ రావు అభిమానులే కాకుండా పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ,మంత్రులు కూడా తీవ్రంగా స్పందించారు.

ఒకవేళ మైనంపల్లి క్షమాపణలు చెబితే క్షమించి వదిలేద్దాం అనుకున్నారు.కానీ హనుమంతరావు అస్సలు తగ్గేదేలే అంటున్నారు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

దీంతో ఆయనపై ఎలాగైనా వేటు వేయాల్సిందే అంటూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఆయనపై వేటు వేసే ముందు అక్కడ మరో అభ్యర్థిని కేటాయించాలి.

Advertisement

ఈ తరుణంలోనే ఓ అభ్యర్థిని కెసిఆర్ పరిశీలన లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆయనే మర్రి రాజశేఖర్ రెడ్డి.ఈయన మంత్రి మల్లారెడ్డి ( Malla reddy) అల్లుడు.గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కొన్ని వేల ఓట్లతో ఓడిపోయారు.

దీంతో మల్కాజ్ గిరి అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి కి సానుభూతి కూడా ఉంటుంది.ఈ తరుణంలోనే కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి ( Marri Rajashekhar Reddy ) కి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

పూర్తిస్థాయిలో బయట పెట్టలేదు కానీ రాజశేఖర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.ఒకవేళ మైనంపల్లి పై వేటు పడితే మాత్రం రాజశేఖర్ రెడ్డి పంట పండినట్టే.

తాజా వార్తలు