హాలీవుడ్ సినిమాలు చేస్తే దర్శకులకు కచ్చితంగా ఆ కండిషన్ పెడతా: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే.

గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

త్వరలోనే హాలీవుడ్ సినిమాలు కూడా చేయబోతున్నారని త్వరలోనే హాలీవుడ్ సినిమాల గురించి ప్రకటన కూడా రాబోతుంది అంటూ ఆస్కార్ అవార్డు వేడుకలలో చరణ్ చెప్పిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా రామ్ చరణ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి g20 సదస్సు ( G20 Summit) వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మూడు రోజులపాటు కాశ్మీర్ లో( Kashmir) పర్యటించనున్నారు.అయితే ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ కాశ్మీర్ వంటి ఒక అందమైన ప్రదేశంలో ఈ సదస్సు నిర్వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మన ఇండియాలో ఇలాంటి అందమైన లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి.

Advertisement

కానీ మనం కేవలం లొకేషన్స్ కోసమే ఇతర దేశాలకు వెళ్తున్నామని చరణ్ తెలిపారు.

ఇకపై లొకేషన్స్ కోసమే ఇతర దేశాలకు వెళ్లాలనే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నానని చరణ్ ఈ సందర్భంగా తెలిపారు.ఇక తాను భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలలో నటించిన హాలీవుడ్ డైరెక్టర్లకు తాను ఒక కండిషన్ తప్పనిసరిగా పెడతానని తెలిపారు.వాళ్లు కూడా ఇండియా వచ్చి ఇక్కడ ఇండియా అందాలను చూసి ఇక్కడే షూటింగ్ చేయాలన్న కండిషన్ వారికి పెడతానని వారిని కూడా మన దేశానికి తీసుకువస్తానని ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్(Game Changer) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు