రష్యాలో చైనా రక్షణ మంత్రి పర్యటన చేస్తుంటే, అమెరికా కంగారు పడుతోంది ఎందుకని?

మొదటినుండి అమెరికా - చైనా స్నేహం కొనసాగిస్తూ వస్తోంది.

అయితే అమెరికా ఆంక్షల చట్రంలో ఉన్న చైనా రక్షణ మంత్రి లీ షెంగ్‌ఫూ ఈ ఆదివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కావడం జరిగింది.

దాంతో అమెరికా అధిష్టానం అవాక్కయింది.లీ షెంగ్‌ఫూ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చేపట్టిన విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

ఓ వైపు రష్యాతో సంబంధాల విషయంలో బీజింగ్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే ఈ పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకతని సంతరించుకుంది.

రష్యాకు చెందిన రొసొబోర్న్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థతో లావాదేవీలు నిర్వహించినందుకు 2018లో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి విదితమే.చైనా ఎస్‌-400లను లీ షెంగ్‌ఫూ హయంలోనే కొనుగోలు చేసింది.మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాస్కోలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి రష్యా చేరుకోవడం పట్ల అమెరికా ఆందోళన చెందుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.చైనాతో రష్యా సైనిక సంబంధాలను బలోపేతం చేసుకొంటోందని భావిస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధం( Russia-Ukraine war )లో రష్యాకు మద్దతుగా ఆయుధ సహకారం అందిస్తుందని అనుమానిస్తోంది అమెరికా.

షెంగ్‌ఫూతో భేటీ సందర్భంగా పుతిన్‌( Vladimir Putin ) మాట్లాడుతూ.గతంలో షీ జిన్‌పింగ్‌ పర్యటన చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.సైనిక రంగం సహా అన్ని విభాగాల్లో ఇరు దేశాలు సంబంధాలను బలపర్చుకొంటున్నాయని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో తిరుగులేని విశ్వాసంతో వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపర్చుకొంటున్నట్లు పుతిన్‌ వెల్లడించడంతో అమెరికా గుండెల్లో గుబులు మొలయ్యింది.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

ఇకపోతే తాజాగా అమెరికా నౌకాదళం సెవెన్త్‌ ఫ్లీట్‌కు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మిలియస్‌ జలసంధిని దాటింది.స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు