ఏపీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు.ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రజలకు చేసిన మంచి మాత్రం ఏం లేదనే చెప్పుకోవచ్చు.
కానీ ఆయన మాత్రం అంతా నేనే చేశానంటూ చెప్పుకుంటూ ఉంటారు.తాను ఏం చెబితే అదే గొప్పని భావిస్తుంటారు.
ఉమ్మడి ఏపీ మొత్తాన్ని అభివృద్ధి చేశాననడమే కాకుండా హైదరాబాద్ ను సైతం కట్టానని చెప్పుకుంటూ ఉంటారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.అదేవిధంగా చంద్రబాబు తానేం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని, ఎన్నిసార్లు అయినా వారిని మోసం చేయొచ్చని భావిస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.
ఈ భావనలో ఉన్న చంద్రబాబు గతంలో విజన్ -2020 అద్భుతమైన కాన్సెప్ట్ అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.తనకు తానే విజన్ ఉందనుకునే చంద్రబాబు తీసుకొచ్చిన విజన్-2020 డాక్యుమెంట్ వలన కలిగిన ప్రయోజనం ఏంటి? దాని వలన ప్రజలకు, సమాజానికి ఒరిగింది ఏమిటి? వ్యవస్థల మీద ఆయన తెచ్చిన విజన్ ఏం ప్రభావాన్ని చూపిందో తెలుసుకుందాం.చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారని తెలుస్తోంది.
ముందుగా సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, వాటిని ఎలా నడపాలంటూ ప్రజలు అయ్యో పాపం అని ఫీల్ అయ్యేలా క్రియేట్ చేస్తారట.చివరికి సంస్థలను అమ్మేస్తేనే భారం పోతుందనే విధంగా జనాల్లో అభిప్రాయాన్ని తీసుకెళ్తారట.
తరువాత దాన్ని అమ్మేసి రాష్ట్రానికి భారాన్ని తగ్గించారనే ప్రజలతోనే చెప్పించగల సమర్థులు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.ఈ విధంగా ఉమ్మడి ఏపీలోని పరిశ్రమలు అమ్మడమే చంద్రబాబు విజనరీ అని అంటున్నారు.
తరువాత టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసిన ఆయన ప్రజలకు గాలికి వదిలేసారు.
ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు డైరెక్షన్ మేరకు ఛార్జీలను పెంచగా ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది.ఇది తీవ్రరూపం దాల్చి కాల్పులకు సైతం దారితీయడంతో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.
ఈ ఘటన బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమ కాల్పులు పేరిట చరిత్రలో నిలిచిపోయిందన్న సంగతి తెలిసిందే.ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకనే భావనలో ఉంటారట చంద్రబాబు.
రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానాన్ని తీసుకొచ్చారు.అయితే టీడీపీ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సైతం నిర్వీర్యం చేశారని, అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారని ప్రజలు చెబుతున్నారు.
అంటే రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులను అవుట్ సోర్సింగ్ కుర్రాడితో కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారిని అప్పటి ఉద్యోగులు మండిపడుతున్నారు.దీని వలన వీరి జీవితాలు చివరి వరకూ అదే తక్కువ జీతాలతో కొనసాగే పరిస్థితి వచ్చిందని దీనికి కారణం కూడా చంద్రబాబు విజనరీ వలనే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నుంచి సైతం కొంత ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే.దీంతో ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేస్తూ వస్తున్నారు.
మరియు అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిష్టు నాయకులూ సైతం చంద్రబాబు దాష్టీకాన్ని , కార్పొరేట్ తరహా పనులను భరించలేక బాబు జమానా అవినీతి ఖజానా అంటూ పెద్ద పుస్తకమే రాశారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనే దాన్ని స్పష్టంగా వివరించారు.
అంతేకాదు అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయింది.ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేకపోగా అడ్మిషన్లు సైతం తగ్గిపోయాయి.
దీంతో మధ్య తరగతి వాళ్ళు సైతం అప్పు చేసి అయినా సరే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనికి కూడా చంద్రబాబు విజనరీ నే కారణమని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి అరాచక భావాలు, అబద్ధాలు, వ్యవస్థలను ధ్వంసం చేసే చంద్రబాబు తీరును చూసిన స్వీట్ జర్ లాండ్ ఆర్ధికమంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ ఇలాంటి అబద్ధాలకోరులను తమ దేశంలో ఐతే జైల్లో కానీ , పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళం అన్నారు.అంటే చంద్రబాబు పాలనా ఏ మాదిరిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర విభజన తరువాత అప్పులు, అవస్థల్లో ఉన్న ఆంధ్రాకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకు ? లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? ఇప్పటీకే అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా.రోడ్లు, రైలు మార్గాలు.
విమానమార్గాలు ఉన్న నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే అదే రాజధాని అయ్యేది కదా.అది లేకుండా లక్షల కోట్ల ఖర్చయ్యే అమరావతి రాజధాని అంటూ మూడు పంటలు పండే పచ్చని భూములను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మారుస్తారా ? ఇదేనా విజన్ ? అనేది ఏపీ ప్రజల మనసుల్లో ప్రశ్నార్థకంగా మారింది.చంద్రబాబుకు నిజంగా ప్రజల మీద ఎలాంటి ప్రేమ, బాధ్యత లేదు.
ఎంతసేపూ తన అనుచరులు, అనుయాయుల లబ్ది, వారికి దోచిపెట్టడం మినహా వేరే ఆలోచన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈయన గతంలో తీసుకొచ్చిన 2020 విజన్ వలన రాష్ట్రం అధోగతి పాలైంది.
ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు 2047 విజన్ తో ప్రజల ముందుకు వచ్చారు.కానీ దాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని క్లియర్ గా అర్థం అవుతోంది.
ఈ కార్యక్రమానికి ప్రజలు దూరంగా ఉండటం బట్టే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు మాటలను కానీ, విజనరీని కాని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని.ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజనరీ కార్యక్రమంలో అన్ని తనకే తెలుసని భావనలో ఉండే చంద్రబాబు ఇంటర్ లో ఇంజనీరింగ్ చదవాలి అంటే బైపీసీ తీసుకోవాలని చెప్పారు.
ఈ మాత్రం తెలియని వ్యక్తి రూపొందించిన విజన్ 2047 వస్తే రాష్ట్రం సంపూర్ణ విధ్వంసమేనని విమర్శలు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy