ఒక్క రూపాయితో ఐడియా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్

జియో దెబ్బకి ఒకదాని తరువాత ఒకటి అన్నట్లుగా, ప్రతీ కంపెనీ మెట్లు కిందకి దిగి వరాల జల్లు కురిపిస్తున్నాయి.

ఎయిర్ టెల్ 1495 రూపాయకు 30జిబి 4G డేటా అందిస్తోంటే, వోడాఫోన్ ఏకంగా, 1GB డేటాకి డబ్బులు చెల్లించి 10GB డేటా పొందమని ఆఫర్ ప్రకటించింది.

BSNL ఎలాగో జియోని దెబ్బతీసే ఆఫర్లతో ముందుకి రానుంది.తాజాగా ఐడియా మరో ఆసక్తికరమైన ఆఫర్ ని అందుబాటులోకి తెచ్చింది.

అదేటంటే, ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ 4G డేటా.ఈ ఆఫర్ ని వాడుకోవాలంటే మీ దగ్గర 4G LTE ని సపోర్ట్ చేసే ఫోన్ తోపాటు, ఐడియా 4G సిమ్ ఉండాలి.

ఇవి రెండూ ఉంటే కనీసం ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉండాలి.అన్నీ ఉంటే మీ ఐడియా 4G సిమ్ నుంచి 411 కి కాల్ చేసి చెప్పిన సూచనల్ని పాటించండి.

Advertisement

వెంటనే మీ బ్యాలెన్స్ నుంచి ఒక్క రూపాయి కట్ చేసుకోని 4G ని అన్ లిమిటెడ్ సేవల్ని అందిస్తుంది ఐడియా.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆఫర్ యొక్క వాలిడిటి ఒక్క గంట మాత్రమే.

ఆ ఒక్క గంటలో మీరెంతైనా వాడుకోవచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఆ ఒక్క గంటసేపు అన్ లిమిటెడ్ 4G ఇంటర్నెట్ మీ సొంతం.

అలాగైతే గంటకోసారి రిఛార్జ్ చేసుకోవచ్చు అని అత్యాశపడకండి.ఒక్క నంబర్ పై ఒకేసారి పనిచేస్తుంది ఈ ఆఫర్.

ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.కాబట్టి త్వరపడండి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు