ఆర్య నుండి నాన్నకు ప్రేమతో వరకు టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పతచుకున్న సుకుమార్ తన సినిమాల్లో సీనియర్ ఆర్టిస్టుల గురించి ఓ సీక్రెట్ బయట పెట్టాడు.మాక్సిమం తన సినిమాల్లో ఎలాంటి సీనియర్ నటులను లేకుండా చూసుకుంటాడట ఎందుకంటే సీనియర్ల దగ్గర తన దర్శకత్వం ప్రతిభ ఎక్కడ చిన్నబోతుందో అన్న భావన సుకుమార్ కు ఉంటుందట.
వందలకొద్ది సినిమాలు చేసున్న సీనియర్స్ అంటే తనకు భయమని వారికి సీన్ చెప్పే సమయంలో ఏమన్నా తప్పులు చేస్తానేమో అని తన సినిమాలో సీనియర్ ఆర్టిస్టులకు ఛాన్స్ ఇవ్వనని అంటున్నాడు సుకుమార్
అయితే ఈ ఫీలింగ్ నుండి సుకుమార్ ఎంత త్వరగా బయట పడితే అంత మంచింది.ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ లేకుండా రాసుకున్న సన్నివెశం ఏదైనా ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వాలంటే కేవలం దర్శకత్వ ప్రతిభ ఒక్కటే సరిపోదు ఆ అభినయానికి కావాల్సిన అనుభవం కూడా ఉండాల్సిందే.
మరి సీనియర్స్ అంటే భయం అంటూ చెప్పుకొస్తున్న సుక్కుకి ఆ భయం పోయి సీనియర్స్ తోనే సినిమా తీయాలని ఆశిద్దాం.ప్రస్తుతం చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్న సుకుమార్ ఆ సినిమా కథను రెడీ చేసుకుంటున్నాడు.







