ఇండియా తో మ్యాచ్...పాక్ కు జరిమానా!!

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఇంకా పాక్.భారత్ ఎదురుపడకుండానే పాక్ టీమ్ సభ్యులు జరిమానాకు గురయ్యారు.

వివరాల్ళోకి వెళితే.స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అఫ్రిదీ, ఓపెనర్ అహ్మద్ షెజాద్, మరో ఆరుగురు క్రికెటర్లు నిర్ణీత సమయానికి తిరిగి హోటల్‌కు రాలేదు.

Pak Players Fine Due To Misbehave-Pak Players Fine Due To Misbehave-General-Telu

అయితే వారంతా ఇక్కడి నైట్ క్లబ్‌కు వెళ్లినట్లు సమాచారం.అంతే కాదు.

పాకిస్ధాన్ ఆటగాడు షహజాద్ అయితే మరో అడుగు ముందుకేసి బాక్సర్‌తో అతను గొడవకు దిగినట్లు సమాచారం.పరిస్థితి అదుపు గొడవపడే వరకు వచ్చింది.

Advertisement

చివరకు షహజాద్ క్షమాపణలు చెప్పడంతో వారంతా నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు.దీనిపై జట్టు మేనేజర్ నవీద్ చీమా పాక్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు.దాంతో పీసీబీ ఒక్కో ఆటగాడికి 230 డాలర్లు (దాదాపు రూ.15 వేలు) జరిమానా విధించింది.అనంతరం ఆటగాళ్లు క్షమాపణ చెప్పారు.

మరో సారి ఇలాంటి ఘటన పునరావృతమైతే, తక్షణమే టోర్నమెంట్ నుంచి బహిష్కరిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు