క్రికెట్ లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ.. అలా చేస్తే భారీ పెనాల్టీ..!

ప్రపంచ కప్ 2023 ముగిసిన తరువాత, క్రికెట్ ఆటలో వేగాన్ని పెంచేందుకు ఐసీసీ క్రికెట్ రూల్స్( ICC Cricket Rules ) లలో ఓ కొత్త రూల్ చేర్చింది.

ఈ రూల్ ను అతిక్రమించిన జట్టుకు భారీ పెనాల్టీ పడనుంది.

ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటంటే.బౌలర్లకు టైం అవుట్ వంటి నిబంధనను ఐసీసీ రూపొందించింది.

ఒక ఇన్నింగ్స్ లో ఒక బౌలర్ మూడవసారి కొత్త ఓవర్ ను ప్రారంభించడానికి 60 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు.ఒకవేళ బౌలర్ 60 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే.

ఆ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.ఈ విషయాన్ని తాజాగా మంగళవారం ఐసీసీ ప్రకటించింది.

Advertisement

ఈ నిబంధన ఇప్పటినుంచి పురుషుల క్రికెట్ వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్ లకు( T20 format ) వర్తిస్తుంది.

అయితే ఐసీసీ ప్రస్తుతం ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.ఈ నిబంధన వల్ల మ్యాచ్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది.ఈ నిబంధన వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ నిబంధనను శాశ్వతంగా అమలు చేయనుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఓ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగే పురుషుల వన్డే క్రికెట్ ఫార్మాట్ లో, టీ20 ఫార్మాట్ లో ట్రయల్ ప్రాతిపదికన అమలు చేయడానికి సీఈసీ అంగీకరించింది.ఈ నిబంధన అమలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఓవర్ల మధ్య సమయాన్ని తగ్గించడం కోసమే.ఐసీసీ తీసుకున్న మరొక నిర్ణయం ఏమిటంటే.

మామూలుగా అయితే అండర్-19 ప్రపంచ కప్ 2024 కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.కానీ దక్షిణాఫ్రికా( South Africa )కు అండర్ 19 ప్రపంచకప్ 2024 ఆతిథ్య బాధ్యతలు ఇస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు