హాట్ టాపిక్ గా మారిన ఐఏఎస్ జంట... అప్పుడు పెళ్లి...ఇప్పుడు...!

ఒకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట ఇప్పుడు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

రాజస్థాన్ కు చెందిన ఈ ఐఏఎస్ జంట ఆధర్ అమిర్ ఉల్ షఫీఖాన్, టీనా దాబి లు ఇరువురు 2015 లో సివిల్స్ టాపర్స్ గా నిలిచారు.

అయితే హిందూ, ముస్లిం అయిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించడం తో విశ్వ హిందూ పరిషత్ కూడా ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోవద్దని విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసినా అందరిని ఎదిరించి మరి ఈ జంట పెళ్లి బంధం తో ఒక్కటైంది.

దీనితో ఈ ఘటన సంచలనం సృష్టించడం తో అందరికీ కూడా గుర్తుండిపోయింది.విశ్వ హిందూ పరిషత్ ను ఎదిరించి మరీ వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే పోస్టింగ్ ల తరువాత పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఈ జంట ఇప్పుడు తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది.

Advertisement
IAS Toppers Pair Applied For Divorce,, Athar Aamir Ul Shafi Khan , Tina Dabi, In

వారిద్దరూ కూడా తమకు విడాకులు కావలి అంటూ కోర్టును ఆశ్రయించారు.భార్య, భర్తలు ఇద్దరికీ కూడా ఒకే రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం అదృష్టంగా భావించారు కానీ రెండేళ్ల కె వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో ఇక ఈ వ్యవహారం కోర్టు వరకు చేరినట్లు తెలుస్తుంది.

Ias Toppers Pair Applied For Divorce,, Athar Aamir Ul Shafi Khan , Tina Dabi, In

తొలుత పెద్దల వరకు వెళ్లినప్పటికీ ఉన్నత ఉద్యోగులే కదా సర్దుకుపోతారు అనుకున్నారు.కానీ వారిద్దరి మధ్య రోజు రోజుకు గొడవలు ముదరి విడాకుల వరకు రావడం తో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.దీంతో అమీర్ జైపూర్‌లోని ప్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

అయితే ఇంతోటి దానికి ప్రేమ,పెళ్లి ఎందుకు అంటూ నెటిజన్లు తమదైన శైలి లో విమర్సలు చేస్తున్నారు.మీ సమస్యనే పరిష్కరించుకోలేని మీరు ఇక జనాల సమస్యలు ఏం పరిష్కరిస్తారని ఎగతాళి చేస్తున్నారు.

అయితే అందరిని ఎదిరించి వివాహం చేసుకున్న ఈ ప్రేమజంట.ఇప్పుడు విడాకుల పేరుతో మరోసారి హాట్ టాఫిక్‌గా నిలిచారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు