48 గంటల్లో 2 లక్షల మందిని కాపాడిన ఐఏఎస్.. తెలుగు తేజం కృష్ణతేజ సక్సెస్ స్టోరీ ఇదే!

ప్రస్తుత కాలంలో చాలామంది వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో సహాయం చేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు.

 Ias Mylavarapu Krishnateja Success Story Details, Mylavarapu Krishnateja, Iam Fo-TeluguStop.com

అయితే ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజ( Mylavarapu Krishna Teja ) మాత్రం ఇతరులకు భిన్నమనే చెప్పాలి.ఆయన సక్సెస్ స్టోరీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమందికి స్పూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మైలవరపు కృష్ణతేజ ఎక్కడ పని చేసినా అక్కడ తన మార్క్ ఉండేలా చూసుకునేవారు.కృష్ణతేజ కేరళ కేడర్ లో( Kerala ) జాయినైన కొంతకాలం తర్వాత అక్కడ భారీ వరదలు( Floods ) వచ్చాయి.

ఆ సమయంలో కృష్ణతేజ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి 48 గంటల్లో సరైన ప్రణాళికతో 2 లక్షల మంది ప్రజలు, మూగజీవాలను కాపాడేలా చేశారు.కృష్ణతేజ కృషికి మెచ్చి యూనిసెఫ్( UNICEF ) వాళ్లు ప్రత్యేకంగా అభినందించారు.

Telugu @unicef, Iam Alleppey, Ias Krishnateja, Iaskrishnateja, Ias, Kerala, Kera

700కు పైగా పునరావాస కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చేసి కృష్ణతేజ( IAS Krishna Teja ) ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థను( WHO ) సైతం ఆశ్చర్యపోయేలా చేశారు.కేరళ కేడర్ ను నేను 6వ ఆప్షన్ గా పెట్టుకున్నానని గురువాయుర్ నా ఫస్ట్ పోస్టింగ్ అని కృష్ణతేజ తెలిపారు.అక్కడి ప్రజల గురించి, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని కృష్ణతేజ అన్నారు.

Telugu @unicef, Iam Alleppey, Ias Krishnateja, Iaskrishnateja, Ias, Kerala, Kera

కేరళలో పరిపాలన వ్యవస్థ కూడా బాగుంటుందని కృష్ణతేజ వెల్లడించారు.ఫేస్ బుక్ లో “iam for alleppey “ అనే పేజీని క్రియేట్ చేశామని ఈ పేజ్ ద్వారా వేర్వేరు సేవా కార్యక్రమాలు నిర్వహించానని కృష్ణతేజ అన్నారు.ఈ ఫేస్ బుక్ పేజీ పెద్ద ఎత్తున చరిత్ర సృష్టించిందని ఆయన తెలిపారు.

మైలవరపు కృష్ణతేజ రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాల దిశగా అడుగులు వేయాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube