బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఇలా బుల్లితెర కామెడీ షోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
గత పది సంవత్సరాలు నుంచి ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలోకి ఎంతోమంది కంటెస్టెంట్లు వచ్చారు వెళ్లిపోయారు అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కూడా కొనసాగుతున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీ సత్య ఒకరు.
చమ్మక్ చంద్ర టీం లో శ్రీ సత్య తన భార్య పాత్రలలో నటించిన సందడి చేశారు.ఈ విధంగా శ్రీ సత్య జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందిన అనంతరం చమ్మక్ చంద్ర ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో తనకు లైఫ్ ఇచ్చిన తన గురువు ఎక్కడ ఉంటే తను కూడా అక్కడే ఉంటానని అందుకే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నానని ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇకపోతే జబర్దస్త్ నుంచి వెళ్లిన అనంతరం ఎలాంటి కార్యక్రమాలలో కనిపించని శ్రీ సత్య తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్న ఈమె తన స్కిట్ అనంతరం వేదికపై మాట్లాడుతూ నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి.నేను ఈ ఫ్యామిలీని ఈ స్టేజిను ఎంతగానో మిస్ అయ్యాను అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఈ స్టేజ్ వదిలిపెట్టేది లేదని ఈ వేదికపై ప్రతి ఒక్కరిని తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ కార్యక్రమం ద్వారా తనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని బయటకు ఎక్కడికి వెళ్లినా తనని శ్రీ సత్య అని కాకుండా జబర్దస్త్ శ్రీ సత్య అని పిలిచినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది అంటూ ఈమె తనకు అవకాశం కల్పించిన మల్లెమాలవారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy