వైరల్: వీళ్ళ ఐడియాకి సలాం కొట్టాల్సిందే..!

ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు కాలుష్యం.నేటి ప్రపంచంలో మానవుడికి తెలియకుండానే ప్లాస్టిక్‌ తో విడదీయరాని బంధం ఏర్పడింది.

ప్లాస్టిక్‌ వస్తువులు లేకుంటే మానవుడి జీవనం కష్టసాధ్యం అన్నట్లుగా మారిపోయింది.పుట్టిన బిడ్డకు పాలపీక మొదలైన ప్లాస్టిక్‌ వినియోగం స్కూలు పిల్లలు, ఉద్యోగులు, వంటింట్లో అనేక రకాల ప్లాస్టిక్‌ పరికరాలు చెంత చేరిపోతున్నాయి.

ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్‌ వస్తువులు సర్వసాధారణంగా మారిపోయి ప్లాస్టిక్‌ భూతానికి రాచబాటలు వేస్తున్నారు.ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా అవన్నీ అర్భాటాలకే పరిమితమవుతున్నాయి.

దీంతో కొందరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని నిలిపివేసి గాజు బాటిల్స్ లో వాటర్ ని అమ్మడం మొదలెట్టారు.కానీ గాజు బాటీల్లో నీటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.

Advertisement

దీంతో ధర ఎక్కువవుతుందనే ఉద్దేశ్యంతో మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ వైపే జనం మొగ్గుచూపుతున్నారు.ఇదే స‌మ‌స్య‌ను ఓ ఇద్దరు యువకులు ఎదుర్కొన్నారు.

దీనికోసం ఏం చేయాలన్న కసరత్తు చేయగా వారికి బుర్రలో ఓ ఐడియా పుట్టింది.

ప్లాస్టిక్ నియంత్రణ గురించి ఆలోచించి పేప‌ర్ వాట‌ర్ బాటిల్స్ కు శ్రీకారం చుట్టారు.అంతకుముందు ఆ యువకులు ఐటీ ఉద్యోగం చేసేవారు.దాన్ని మానేసి కొన్ని రోజుల తరబడి ఈ ప్లాస్టిక్ ని ఎలా అరికట్టాలనే దానిపై గంటల తరబడి ఇంటర్నెట్ లో అన్వేషించారు.

అలా ఆలోచించి పేపర్ వాటర్ బాటిల్స్ కి శ్రీకారం చుట్టారు.వీటిని ఎక్కడికైనా సునాయాసంగా తీసుకెళ్లేలా, ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునేలా వీలుగా త‌యారు చేశారు.కాగా, ఈ ఇద్ద‌రు యువ‌కులు ఆవిష్క‌రించిన పేప‌ర్ వాట‌ర్ బాటిల్స్ దేశంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

కారిగేటెడ్‌ పేపర్‌ ఉపయోగించి టేంపర్‌ప్రూఫ్‌ వాటర్‌ బాక్స్‌ తయారు చేశారు.ఈ వాట‌ర్ బాటిల్స్ లో దాదాపు 85 శాతం వరకు ప్లాస్టిక్ వాడ‌కుండ‌ ఈ కారో బాక్స్‌ను రూపోందించారు.

Advertisement

ఈ వాట‌ర్ బాటిల్స్ ను మ‌నం యాప్‌లో బుక్‌ చేసుకుంటే వాళ్లే ఇంటికి తీసుకొచ్చి అందిస్తారు.