Manchu Manoj : నాకు అన్నయ్య కు అదే పెద్ద తేడా : మంచు మనోజ్

సోషల్ మీడియా సాక్షిగా మంచు కుటుంబంలో జరుగుతున్న కలహాలపై పెద్ద రగడ సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

చాలా రోజులుగా మంచు బ్రదర్స్ అయినా మనోజ్ మరియు విష్ణు ఒకరితో ఒకరు గొడవ పడుతూ, అది పెద్దదిగా చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇదే విషయాన్ని మంచు మనోజ్ ( Manchu Manoj )తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు.కానీ ఆ విషయాన్ని బయటపెట్టిన కాసేపటికి మనోజ్ డిలీట్ చేశాడు.

ఏది ఏమైనా మంచు బ్రదర్స్ కి మాత్రం చాలా రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి.కారణాలు ఏంటో తెలియదు కానీ ఒకరంటే ఒకరికి ఎప్పుడూ కోపం తప్ప ప్రేమగా మాట్లాడుకున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో లేవనే చెప్పాలి.

I Have Lot Of Differences With My Brother Says Manchu Manoj

ఇది గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పరిస్థితి కాస్త వెనక్కి వెళితే మంచు విష్ణు ( Manchu Vishnu )అలాగే మనోజ్ ఒకరంటే ఒకరు మంచి గౌరవ మర్యాదలు ఇచ్చుకునేవారు.పేరుకే తల్లులు వేరు కానీ అంత కన్నా ఎంతో మంచి అనుబంధంతో ఉన్నట్టుగా కనిపించేవారు.ఒక సందర్భంలో మంచు మనోజ్ ఇంటర్వ్యూలో తన అన్నయ్యకు తనకు గల తేడాను చక్కగా వివరించారు.

Advertisement
I Have Lot Of Differences With My Brother Says Manchu Manoj-Manchu Manoj : న�

తనకు ఏ విషయంలోను పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని, కేవలం నటించడం కోసం వచ్చాము కాబట్టి నటన మాత్రమే చూసుకుంటే సరిపోతుందని, ఇంటి విషయాలు, వ్యాపార విషయాల్లో వేలు పెట్టను అని, కానీ మా అన్నయ్య విష్ణు అలా కాదని తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని అందుకే స్కూల్స్, కాలేజెస్ అన్నీ తానే చూసుకుంటాడని, ఇంటి విషయంలో కూడా ప్రతి ఒక్కటి కలగజేసుకొని మరి బాధ్యతగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.

I Have Lot Of Differences With My Brother Says Manchu Manoj

ఇంటి కి చెందిన వ్యాపారాలు మాత్రమే కాకుండా తనకంటూ కూడా కొన్ని సొంత వ్యాపారాలు ఉన్నాయని, పెళ్లయిన తర్వాత వాటిని విస్తరించుకుంటూ వెళుతున్నాడని, దేశ విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ బాగానే కూడా పెడుతున్నాడని కానీ అందుకు తాను పూర్తిగా విరుద్ధమని తనకు డబ్బుల విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదని అందుకే ఏం జరిగినా పటీపట్టనట్టుగా ఉంటానంటూ చెప్తున్నాడు మనోజ్.దీన్ని బట్టి చూస్తే మంచు విష్ణు తన ఫ్యామిలీ కోసం చాలానే కష్టపడుతున్నదని అనుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు