ఒమెన్ లో తెలంగాణ మహిళ అష్టకష్టాలు..అండగా నిలిచిన విదేశాంగ శాఖ...!!!

పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్ళిన తెలంగాణా మహిళ ట్రావెల్ ఏజెంట్స్ మోసంతో అష్టకష్టాలు పడింది.

చివరకు విదేశాంగ శాఖ సహకారంతో తిరిగి తెలంగాణా చేరుకుంది.

ఇలా ఏజెంట్స్ చేతిలో మోసపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు.ఎన్ని సార్లు ప్రభుత్వాలు హెచ్చరించినా, ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా సరే మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Hyderabad Woman Trafficked To Oman Rescued,Hyderabad , Oman, Telugu NRI, Ministr

మహిళలకు మాయమాటలు చెప్తూ విదేశాలలో ఉద్యోగాల సాకు చూపుతూ అక్కడికి వెళ్ళాక మహిళలు చిత్ర హింసలు పడుతున్న ఘటనలు కోకొల్లలు.తాజాగాతెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, షహీన్ నగర్ కు చెందిన ఓ మహిళ ఇలాంటి అనుభవాన్ని చవిచూసింది.

ఓ ఏజెంట్ మాటలు నమ్మి ఒమెన్ లో మంచి ఉద్యోగం దొరుకుతుందని, తన కుటుంభానికి మంచి జరుగుతుందని భావించిన ఓ మహిళ ఒమన్ వెళ్ళింది.ముందుగా ఏజెంట్ మస్కట్ లో ఉద్యోగమని చెప్పి ఒమెన్ పంపాడని, ఈ ప్రాంతం ఒమెన్ కి చాలా దూరంలో ఓ పల్లెటూరిలో ఉందని అక్కడికి వెళ్ళిన తరువాత ఓ వ్యక్తి ఇంట్లో పనికి పెట్టారని, ముందు ఉద్యోగమని చెప్పి తరువాతా ఇంట్లో పనులు చేయించారని వాపోయింది.2021 నవంబర్ నుంచీ తాను అక్కడే పని మనిషిగా చేస్తున్నానని, ప్రతీ రోజు 18 గంటలు పని చేయించుకున్నా సరే యజమాని కొట్టేవాడని, చిత్ర హింసలు పెట్టేవాడని తాను హైదరాబాద్ వెళ్లిపోవాలంటే రూ.2 లక్షలు చెల్లిస్తేనే కుదురుతుందని బెదిరించే వాడని ఆమె వాపోయింది.ఈ విషయాన్ని ఆమె తన కుటుంభ సభ్యులకు తెలుపడంతో వారు కొందరు స్వచ్చంద సంస్థల సాయంతో విదేశాంగ శాఖకు తమ గోడు తెలిపారు.

Advertisement

ఈ ఘటనపై స్పందించిన విదేశాంగ శాఖ అక్కడి యజమానితో మాట్లాడి ఆమె సురక్షితంగా సొంత గ్రామం చేరుకునే ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం సొంత ఊరిలో ఉంటున్న ఆమె తనలా ఎవరూ మోసపోవద్దని తెలిపింది.

ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన ప్రజలు మోసపోతున్నారని ఎంజేంట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు