కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..

చైనాలోని ఒక కోర్టులో విడాకుల కేసు విచారణ జరుగుతున్న సమయంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.20 సంవత్సరాల పాటు కొనసాగుతున్న తన వివాహ బంధాన్ని(Marriage bond) విడదీయడానికి నిరాకరించిన భర్త, కోర్టులోనే ఒక విచిత్రమైన ప్రదర్శన చేశాడు.

అతను తన భార్యను భుజాలపై ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయాడు, చట్టపరమైన విచారణను అడ్డుకున్నాడు.

ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

అసలేం జరిగిందంటే, భర్త లీ అనే వ్యక్తి తన భార్య చెన్‌పై అత్యాచారం చేస్తున్నాడట.కుటుంబంలో హింసకు పాల్పడుతున్నాడని కూడా భార్య ఆరోపణలు చేసింది.దీంతో భార్య చెన్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

మొదట కోర్టు ఈ దంపతుల మధ్య బలమైన అనుబంధం ఉందని, వారి సంబంధాన్ని రక్షించే అవకాశం ఉందని భావించి విడాకులు మంజూరు చేయలేదు.

Advertisement

కానీ భార్య చెన్ మళ్లీ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.ఈసారి కోర్టుకు వెళ్లినప్పుడు భర్త లీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.తన భార్య చెన్‌ను భుజాలపై మోసుకొని కోర్టు నుంచి పారిపోయాడు.

ఈ సమయంలో భార్య బిగ్గరగా కేకలు వేసినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది.కోర్టు నుంచి సతీమణిని ఎత్తుకొని పారిపోతున్న లీని అధికారులు ఆపారు.

ఆపై తన తప్పుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు.ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తప్పును గ్రహించానని, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయనని హామీ ఇచ్చారు.

కాగా ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది దీని గురించి తెలిసి చాలామంది నవ్వుకుంటున్నారు.ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ సినిమాల్లో కూడా జరిగి ఉండదు అని పేర్కొంటున్నారు.

బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!
యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం

ఆ భార్య మరొకసారి కోర్టు మెట్లు ఎక్కుతుందో లేదో ఇంకా చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు