జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్( Hrithik Roshan ) కాంబోలో ”వార్ 2” ప్రకటించిన విషయం తెలిసిందే.ఊహించని ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది.
అసలు ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను ఓకే ఎవ్వరూ ఊహించలేదు.కానీ ఎవ్వరి అంచనాలకు అందకుండా తారక్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయినట్టు ప్రకటన రాగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుందా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు పూర్తి అవుతుంది? రిలీజ్ ఎప్పుడు చేస్తారు ? అనే వేల సందేహాలు వచ్చాయి.
మరి ఈ సినిమా రిలీజ్ డేట్ నిన్న అఫిషియల్ గా ప్రకటించి మరోసారి సర్ప్రైజ్ ఇచ్చారు.2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన వార్ మూవీకు సీక్వెల్ గా ఇది తెరకెక్కనుంది.మరి ఈ సినిమా సీక్వెల్ ను 2025, ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు.
ఈ మేరకు నిన్న అఫిషియల్ అప్డేట్ కూడా వచ్చింది.అయితే ఇదే డేట్ ను లాక్ చేయడానికి కారణం తెలుస్తుంది.
ఆగస్టు 14న రిలీజ్ చేయనుండగా ఆ తర్వాత రోజు స్వాతంత్య దినోత్సవం, ఆగస్టు 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం, ఆ తర్వాత 22 నుండి 24 వరకు రెండవ వీకెండ్ ఆగస్టు 27న వినాయకచవితి, ఆగస్టు 29 నుండి 31 వరకు మూడవ వీకెండ్, సెప్టెంబర్ 4న ఈద్, సెప్టెంబర్ 5న ఓనం, 6, 7 నాల్గవ వీకెండ్ ఇలా మొత్తంగా వరుసగా సెలవలు ఉన్నాయి.
మరి ఈ సినిమా రిలీజ్ రోజు కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక రికార్డులను ఆపడం ఎవ్వరి తరం కాదు.మధ్య మధ్యలో వీక్ డేస్ ఉన్న చాలా సెలవలు ఉండడంతో పక్కా ప్లానింగ్ తోనే ఈ డేట్ ను మేకర్స్ లాక్ చేసినట్టు తెలుస్తుంది.కాగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అత్యంత భారీ స్థాయిలో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ( Kiara Advani ) ఫిక్స్ అయ్యింది.యాక్షన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ( Director Ayan Mukerji ) తెరకెక్కించనున్న ఈ ”వార్ 2” ఇప్పటికే షూట్ స్టార్ట్ కాగా హీరోలు కూడా అతి త్వరలోనే జాయిన్ కానున్నారు.
మరి ఈ సినిమా తారక్ కెరీర్ కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.