ఆ సినిమా ఎవరు రీమేక్ చేసినా హిట్టు పక్కా..!

మళయాళంలో ఈమధ్య రిలీజై ప్రేక్షకులను మెప్పించిన సినిమా హృదయం.

వినీత్ శ్రీనివాసన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన హీరోయిన్స్ గా నటించారు.

విశాక్ సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా జనవరి 21న థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అందుకుంది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హృదయం యువత మెచ్చే అంశాలు ఉండటంతో సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరధం పట్టారు.

Hridayam Telugu Remake Definately Hit These Reasons, Hridayam, Kollywood , Toll

మళయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగు రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.బడా నిర్మాణ సంస్థ ఇప్పటికే హృదయం రీమేక్ హక్కులను పొందినట్టు టాక్.

అయితే ఈ సినిమా రీమేక్ ఎవరు డైరెక్ట్ చేస్తారు.సినిమా లో హీరో, హీరోయిన్స్ గా ఎవరు చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

ఎవరు డైరెక్ట్ చేసినా ఎవరు హీరో, హీరోయిన్స్ గా నటించినా సరే హృదయం తెలుగు రీమేక్ కూడా సూపర్ హిట్ అవడం పక్కా అని చెప్పు కుంటున్నారు.తెలుగు ఆడియెన్స్ కి నచ్చే ఎమోషనల్, లవ్ సీన్స్ ఉండటంతో సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేస్తుందని అంటున్నారు.

 త్వరలోనే తెలుగు హృదయం సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

Advertisement

తాజా వార్తలు