టీవి ఎక్కువసేపు చూడ్డానికి, వీర్యకణాల ఉత్పత్తికి ఏంటి సంబంధం?

మీరు ఎన్నోసార్లు విన్న విషయమే కాని మళ్ళీ వినండి.మన పూర్వీకులలో ఉన్నంత స్పెర్మ్ కౌంట్, ఇప్పటి పురుషుల్లో లేదు.

రాను రాను ఇది పడిపోతోంది.భవిష్యత్తులో ఇంకా పడిపోనుంది.

How Watching TV Can Decrease Sperm Count?-How Watching TV Can Decrease Sperm Cou

ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకటి డైట్ మారడం వలన.డైట్ లో ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఎలాగో స్పెర్మ్ కౌంట్, అంటే వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతోంది, కాని అదొక్కటే కారణం కాదు.టీవి కూడా వీర్యకణాల సంఖ్య తగ్గేలా చేస్తోందని పరిశోధకులు ఓ దశాబ్దకాలంగా చెబుతూనే ఉన్నారు.ఇందులో నిజమెంత? అసలు టీవికి, వీర్యకణాలకి ఏంటి సంబంధం ? బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్‌ మెడిసిన్ లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఒక రిపోర్టుని ప్రచూరించారు.18-22 ఏళ్ళ మధ్యలో ఉన్న 189 యువకులని వారు పరీక్షించారు.ముందు స్పెర్మ్ కౌంట్ చూసి, ఆ తరువాత కొన్నిరోజులు టివి ఎక్కువ చూడమని చెప్పారు.

వారు చెప్పిందే చేసారు.ఇంట్లో కూర్చొని గంటలకొద్దీ సినిమాలు చూడ్డం అలవాటు చేసుకున్నారు.

Advertisement

కొన్నిరోజులు తరువాత మళ్ళీ వారిని పిలిచి స్పెర్మ్ కౌంట్ వీర్యకణాల సంఖ్య తగ్గినట్లు స్పష్టంగా కనిపించింది.అది కూడా చిన్న తరుగుదల కాదు, ఏకంగా 44%.ఎందుకు ఈ తేడా ? నిజానికి ఈ తేడా టివి చూడ్డం వలన రాలేదు.కూర్చోని గంటలు గంటలు టీవి ముందు గడపటం వలన.శారీరక శ్రమ లేకపోవడం వలన.ఒళ్ళు కదలకపోతే కొవ్వు పెరుగుతుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పెరిగిపోతాయి.ఇవి రెండు పెరుగుతున్నాయి అంటే వీర్యకణాల సంఖ్య పడిపోతున్నట్లే.

ఇవి మాత్రమే కాకుండా శరీరంలో అక్సిడేవిట్ ప్రెషర్ పెరిగిపోతుంది.ఈ కారణంతో కూడా విర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.

ఇంకో విషయం చెప్పాలి.అధిక ఉష్ణోగ్రతలో వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది.

కూర్చోని ఉండటం వలన వృషణాల మీద ఒత్తిడి పెరిగి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.దీన్నే scrotal temperature అని అంటారు.

తాళి బొట్టులో దాగి ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా?

ఇది వీర్య ఉత్పత్తికి ఏమాత్రం మంచిది కాదు.ఇంకేం, స్పెర్మ్ కౌంట్ ఆటోమెటిక్ గా తగ్గుతుంది.

Advertisement

కాబట్టి ఎక్కువసేపు టీవి ముందే కాదు, కంప్యూటర్ ముందు కూడా కూర్చోకండి.మనిషి శరీరం కదిలితేనే ఆరోగ్యం.

తాజా వార్తలు