తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో ఎన్టీఆర్ ( NTR )ఒకరు ఆయన చేసిన సినిమాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది.
అలాంటి హీరో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అనే విషయం ఇప్పుడు నెట్లో తెగ వైరల్ అవుతుంది ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ , షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్, జాన్ అబ్రహం వంటి బాలీవుడ్ స్టార్లు మాత్రమే నటించిన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇప్పుడు సౌత్ నుంచి యంగ్ టైగర్ నటించబోతున్నారు.
బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ అండ్ సౌత్ ఇండస్ట్రీలు ఓ రేంజ్ లోషేక్ చేసలా అఫీషియల్ న్యూస బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.అయితే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్( YRF Spy Universe ) నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాల్లో హీరోలు రా ఏజెంట్లుగా కనిపిస్తారు.దేశం కోసం శత్రువులతో పోరాడుతుంటారు.ఈ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘ఏక్ థా టైగర్’.2012 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఘన విజయన్నీ కైవసం చేసుకుంది .దీని తరువాత అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలోనే ‘టైగర్ జిందా హై’ సినిమా 2017 లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.ఇక మూడో సినిమా ‘వార్’.
యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.ఇక చివరిగా ఈ ఏడాది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనే ‘పఠాన్’ సినిమా వచ్చింది.
షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి .బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది.ఇలా తీసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి.
మల్టీ స్టారర్ కం యాక్షన్ సినిమా గా తెరకెక్కిన “వార్” సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.‘వార్ 2’ సినిమా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కాకుండా , బ్రహ్మస్త్ర ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్నట్లు నిన్న కన్ఫర్మ్ అయ్యింది.
ఇక నేడు జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్టు ఖరారు చేశారు.ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు బాలీవుడ్ మీడియాతో పాటు…టాలీవుడ్ వాళ్ళు కూడా అఫీషియల్ గా కన్ఫాం చేయగా.
టైగర్ అభిమానులు సంబర పడుతున్నారు.ప్రస్తుతం ఎన్టీయార్ కి దేశం మొత్తం మంచి క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.
దాన్ని కాచ్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy