ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌కైనా చెక్ పెట్టే ప‌చ్చి పాలు.. ఈ టిప్స్ ను అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

ఏదైనా చర్మ సమస్య( Skin Problem ) తలెత్తింది అంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.

ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం రీసెర్చ్ లు మొదలు పెడుతుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, పైసా ఖర్చు లేకుండా పచ్చి పాలుతో ఎలాంటి చర్మ సమస్యనైనా వదిలించుకోవచ్చు.

మరి పచ్చి పాలను ఏ సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఒక్కోసారి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్( Dead SkinC ells ) పేరుకుపోయి ముఖం నిర్జీవంగా మారుతుంటుంది.

Advertisement

అలాంటి సమయంలో ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, అరకప్పు పచ్చి పాలు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆపై మిక్సీ జార్ లో నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ) ను మెత్తగా గ్రైండ్ చేసుకుని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వేళ్ళతో సున్నితంగా రబ్ చేస్తూ చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మురికి, మృతకణాలు పోయి చర్మం క్షణాల్లో అందంగా కాంతివంతంగా మారుతుంది.

మొటిమల సమస్య( Pimples )తో సతమతం అవుతున్న వారు మూడు టేబుల్ స్పూన్ల పచ్చి పాలల్లో వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మొటిమలు రావడం క్రమంగా తగ్గుముఖం పడతాయి.

కొందిరి స్కిన్ చాలా డ్రై గా ఉంటుంది.అలాంటివారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలకు వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే డ్రై స్కిన్( Dry Skin ) అన్నమాట అనరు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

స్కిన్ టైట్ గా కూడా మారుతుంది.

Advertisement

స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడేవారు ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అర‌క‌ప్పు పచ్చిపాలు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత నానబెట్టుకున్న గుమ్మడి గింజలను( Puumpkin Seeds ) మెత్త‌గా గ్రైండ్ చేసుకుని ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఇలా చేస్తే చర్మం తెల్లగా మారుతుంది.

మృదువుగా కోమలంగా మెరుస్తుంది.మొండి మచ్చలతో బాధపడుతున్న వారు నాలుగు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలల్లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్‌ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.

పూర్తిగా ఆరిన తర్వాత వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఎలాంటి మచ్చలైన తగ్గుముఖం పడతాయి.

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు