ఆలు తొక్కతో ఇలా చేస్తే‌ అందంగా మెరిసిపోవ‌చ్చు!!

అందంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం ఎన్నో చిట్కాలను ఉపగిస్తారు.

ఈ క్ర‌మంలోనే ఎంతో డబ్బులు ఖర్చుబెట్టి టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, ఫేస్ క్రీములు ఇలా ర‌కాల ప్రోడెక్ట్స్ కొనుగోలు చేసి.వాడుతుంటారు.

అయితే వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది కాదు.ఇలాంటివి వాడ‌డం వ‌ల్ల లేని చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

అందుకే ఎప్పుడూ చ‌ర్మాన్ని స‌హ‌జ ప‌ద్ధ‌తిలోనే మెరిపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి.ఎందుకంటే.

Advertisement
How To Use Potato Peel For Glowing Skin? Potato Peel For Glowing Skin, Potato Pe

నేచురల్ గా లభించే ఏ పదార్థమైనా సరే చర్మానికి హాని కలిగించవు.ఇక చ‌ర్మాన్ని స‌హ‌జంగా మెరిపించ‌డంలో ఆలు(బంగాళదుంప) తొక్క అద్భుతంగా ప‌నిచేస్తుంది.

మ‌రి ఆలు తొక్క‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బంగాళ‌దుంప తొక్క‌ల‌ను తీసుకుని.

నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.అనంత‌రం తొక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి.

బాగా పేస్ట్ చేసుకోవాలి.

How To Use Potato Peel For Glowing Skin Potato Peel For Glowing Skin, Potato Pe

ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ‌రసం మ‌రియు తేనె వేసి ముఖానికి, మెడ‌కు ప‌ట్టించాలి.అరగంట త‌ర్వాత గోరువెచ్చ‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

Advertisement

అలాగే ముడ‌త‌ల పోగొట్టి.చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, అందంగా చేస్తుంది.

ఇక మ‌రో టిప్ ఏంటంటే.బంగాళ‌దుంప తొక్క‌ల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి.

అనంత‌రం బాగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా ముల్తానీ మట్టి, పెరుగు మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.

అరగంట త‌ర్వాత చ‌ల్ల‌‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది.

అలాగే చ‌ర్మంపై ఉన్న జిడ్డు కూడా పీల్చుకుని.ముఖాన్ని తాజాగా మెరిసేలా చేస్తుంది.

తాజా వార్తలు