తాప్సికి అభిమాని అయిపోయా అన్న హృతిక్... సోషల్ మీడియాలో కామెంట్స్

లేడీ ఒరియాంటెడ్ కథలతో ఈ మధ్య బాలీవుడ్ లో దూసుకుపోతున్న నటి తాప్సి.తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఇక్కడ కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది.

 Hrithik Roshan Wishes Taapsee Pannu On Birthday, Bollywood, Kangana, Nepotism, B-TeluguStop.com

అయితే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే సినిమాలు సౌత్ లో ఆమెకి పెద్దగా రాలేదు.ఆమెని సౌత్ దర్శక, నిర్మాతలు కేవలం గ్లామర్ క్వీన్ గానే చూసారు.

అయితే బాలీవుడ్ ఆమెకి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది.వచ్చిన అవకాశాలని రెండు చేతులా ఒడిసిపట్టుకొని అక్కడ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది.

తక్కువ బడ్జెట్ తో లేడీ ఒరియాంటెడ్ కథలని తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా మారింది.ఇక బాలీవుడ్ లో ఆమెని అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.

తాప్సి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి చాలా మంది సెలబ్రిటీల నుంచి విషెస్ వచ్చాయి.అయితే ఇందులో హృతిక్ రోషన్ నుంచి కూడా రావడం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

నీ అభిమాని నుంచి.పుట్టినరోజు శుభాకాంక్షలు తాప్సీ.ఈ సంవత్సరం ఎంతో ఎంతో బాగుండాలి.బిగ్‌ హగ్‌ అంటూ బాలీవుడ్‌ స్టార్ హీరో‌ హృతిక్‌ రోషన్‌ ప్రత్యేకంగా విష్‌ చేశాడు.

ఇందుకు స్పందించిన తాప్పీ ఈ మెసేజ్‌ చూసి నేను షాక్ అయ్యాను.అసలు ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు.

నా గత బర్త్‌డే గిఫ్ట్‌ ఇది.నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తానో తెలుసు కదా.థాంక్యూ అంటూ హర్షం వ్యక్తం చేశారు.అయితే తాప్సిపై ఉన్నపళంగా హృతిక్ అంత ప్రేమ కురిపించడానికి కారణం ఆమె కేవలం కంగనాని టార్గెట్ చేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో నెపోటిజం అంటూ గత కొద్ది రోజులుగా కంగనా రెచ్చిపోతూ ఉంటే ఆమెకి తాప్సి గట్టి కౌంటర్ వేసింది.దీంతో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఈ నేపధ్యంలో తాప్సికి విషెస్ చెప్తూ హృతిక్ చేసిన పోస్ట్ పై కూడా కంగనా అభిమానులు అదే కోణంలో ప్రోజక్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube