నిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇలా వాడితే మీ ముఖం తెల్లగా మారుతుంది!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మ పండ్లను విరివిరిగా వాడుతుంటారు.

అయితే అందరూ చేసే కామన్ పొరపాటు ఏంటంటే నిమ్మ పండులో ఉండే జ్యూస్ ను తీసుకుని తొక్కలను బయట పారేస్తుంటారు.

కానీ నిమ్మ తొక్కలతో మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చడానికి నిమ్మ తొక్కలు ఎంతగానో సహాయపడతాయి.

చర్మంపై మొండి మచ్చలు మాయం చేయడానికి సైతం నిమ్మ తొక్కలు(Lemon peels) ఉపయోగపడతాయి.మరి ఇంతకీ చర్మానికి నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో కొన్ని నిమ్మ తొక్కలు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement
How To Use Lemon Peel For Skin Whitening Lemon Peel, Lemon Peel Benefits, Skin W

ఇలా ఉడికించిన నిమ్మ తొక్కలను చల్లారిన తర్వాత వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న నిమ్మ తొక్కల మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.

How To Use Lemon Peel For Skin Whitening Lemon Peel, Lemon Peel Benefits, Skin W

ఈ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,(coffee powder) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్(Sweet almond oil) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకొని కనీసం ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

How To Use Lemon Peel For Skin Whitening Lemon Peel, Lemon Peel Benefits, Skin W

ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.స్కిన్ వైట్నింగ్ కి(Skin whitening) ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.అదే సమయంలో చర్మంపై ఉండే మొండి మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబ‌ట్టి, ఇక‌పై నిమ్మ తొక్క‌ల‌ను పారేయ‌డం ఆపేసి.

న్యూస్ రౌండప్ టాప్ 20

పైన చెప్పిన విధంగా వాడేందుకు ప్ర‌య‌త్నించండి.

Advertisement

తాజా వార్తలు