ముఖ చ‌ర్మాన్ని వైట్ అండ్ బ్రైట్‌గా మార్చే మందారం.. ఎలా వాడాలంటే?

సాధారణంగా తమ ముఖాన్ని వైట్ గా మరియు బ్రైట్ గా మార్చుకునేందుకు చాలా మంది మార్కెట్లో ల‌భ్యం అయ్యే రకరకాల క్రీములు, సీరంలు, ఫేస్ మాస్కులు వంటివి కొనుగోలు చేసి వాడుతుంటారు.

త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి ఫేషియ‌ల్‌, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు.

ఈ క్రమంలోనే వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా అందరూ ఇళ్లల్లో ఉండే మందారం పూలతో అందాన్ని మెరుగు పరుచుకోవచ్చు.

ముఖ్యంగా మందారం పూలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మీ ముఖం సహజంగానే వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం మందారం పూలతో అందాన్ని ఎలా పెంచుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందు రెండు మందారం పువ్వులు తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి.వాటికి ఉన్న రేకులను వేరు చేయాలి.

Advertisement

ఆ తర్వాత మిక్సీ జార్ లో మందారం రేకులు, రెండు టేబుల్ స్పూన్ల రోజ్‌ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే కనుక ముఖం సహజంగానే తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

అలాగే చర్మంపై ఏమైనా మచ్చలు కనుక ఉంటే క్రమంగా మాయం అవుతాయి.అలాగే మందార పూలతో ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య సైతం దూరం అవుతుంది.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు