మందార పువ్వులు అలంకరణకే కాదు ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది!

గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో ఒకటి లేదా రెండు మందారం మొక్కలు కచ్చితంగా ఉంటాయి.

వాటికి పోసే మందార పువ్వులను( Hibiscus flowers ) దేవుని అలంకరణకు ఎక్కువగా వాడుతుంటారు.

అయితే మందారం పువ్వులు అలంకరణకే కాదు అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఉపయోగ‌పడతాయి.ముఖ్యంగా మందార పువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్( Skin Care ) మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం చర్మ సౌందర్యానికి మందార పువ్వులను ఎలా వాడాలో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఎండిన మందార పువ్వులు వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement
How To Use Hibiscus Flowers For Clear And Glowing Skin Details! Hibiscus Flowers

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn Flour ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై స్టవ్ పై ఉంచి దగ్గర పడే వరకు ఉడికించాలి.

క్రీమీ స్ట్రక్చర్ లోకి మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి.

How To Use Hibiscus Flowers For Clear And Glowing Skin Details Hibiscus Flowers

పూర్తిగా చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేస్తే మంచి మ‌సాజ్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ మసాజ్ క్రీమ్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

How To Use Hibiscus Flowers For Clear And Glowing Skin Details Hibiscus Flowers
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇలా ప్రతిరోజు చేస్తే చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా ద‌రిచేరకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

Advertisement

స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.

సహజంగానే మీ చర్మం కాంతివంతంగా, ఆకర్షణీయంగా మెరుస్తుంది.

తాజా వార్తలు