Coconut water : చుండ్రును నివారించి జుట్టును ఒత్తుగా పెంచే కొబ్బరినీళ్లు.. ఎలా వాడాలంటే?

కొబ్బరి నీళ్లు( coconut water ) .ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు ఎంతో ఇష్టంగా తాగుతారు.కొబ్బరి నీళ్ళు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

మరియు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం కొబ్బరి నీళ్లు తోడ్పడతాయి.

ముఖ్యంగా చుండ్రు, దురద, ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించి జుట్టును ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంతకీ జుట్టుకు కొబ్బరి నీళ్లు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బ‌రి నీళ్లను రెడీ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక కలబంద( Aloe vera ) ఆకు తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కలబంద జెల్ వేసి గ్రైండ్ చేస్తే జ్యూస్ రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.కలబంద జ్యూస్ లో ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరినీళ్లు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ద్వారా మంచి హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.

ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ తో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) పుష్కలంగా ఉంటాయి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఇవి నెత్తిమీద దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తాయి.చుండ్రు సమస్యను నివారిస్తాయి.

Advertisement

స్కాల్ప్ ను తేమ‌గా, ఆరోగ్యంగా మారుస్తాయి.అలాగే కొబ్బరి నీళ్లను ఇప్పుడు చెప్పుకున్న విధంగా వారానికి ఒకసారి వాడారంటే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

మూలాల నుంచి కురులు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు