రైల్వే రిజర్వేషన్ టికెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలంటే..!

చాలా మందికి ట్రైన్ ప్రయాణం అంటే చాలా ఇష్టం.కరోనా కారణంగా అనేక ట్రైన్లు నడవలేదు.

కొన్ని ప్రత్యేక మైన ట్రైన్లను మాత్రమే సర్కార్ నడిపింది.అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడటంతో ట్రైన్లు పట్టాలెక్కాయి.

మరి ఇటువంటి రైలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని ఆపేయాల్సి వస్తుంది.అంటే ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకునే పరిస్థితి కలుగుతుంది.

మరి ఆ సమయంలో ఆ ట్రైన్ టిక్కెట్ ను రద్దు చేసుకునేస్తాం.చాలా మంది ఈ పనే చేస్తారు.

Advertisement
How To Transfer The Railway Reservation Ticket, Train Journey, Train, Travel, Ti

అయితే మనం రద్దు చేసిన ఆ టికెట్ ను మనకు తెలిసినవారికో లేదంటే మన బంధువులకో బదిలే చేసే అవకాశం కూడా ఉంది.అయితే ఈ విధానం చాలా మందికి తెలీదు.

రిజర్వేషన్ టికెట్ ఉండి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లైతే ఆ టికెట్ ను కుంటుంబీకుల పేరుపై మార్చొచ్చు.ఇలా చేయాలంటే ముందుగా అంటే ప్రయాణం రద్దు చేసుకున్న 24 గంటలకు ముందు రైల్వే అధికారులకు ఒక అర్జీ అనేది పెట్టాల్సి ఉంటుంది.

ఆ తర్వాత టికెట్ మీదుండే పేరును తీసేసి వేరే వ్యక్తి పేరు మీద దాన్ని మార్చాలి.ఇలాంటి ఛాన్స్ ఒకసారి మాత్రమే కలుగుతుంది.

ఒకసారి ఒకరికి బదిలీ చేసిన టికెట్ ను వేరొకరికి బదిలీ చేసే అవకాశం ఉండదు.మొదటగా ట్రైన్ రిజర్వేషన్ టికెట్ బదిలీ చేయడానికి రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రింట్ అవుట్ ను తీసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ఆ తర్వాత సమీపంలో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ కు వెళ్లాలి.

How To Transfer The Railway Reservation Ticket, Train Journey, Train, Travel, Ti
Advertisement

ఆధార్ లేదా ఓటర్ ఐడీ అనేది అక్కడికి తీసుకెళ్లాలి.మీరు ఎవరి పేరు మీద టికెట్ ను మార్చాలనుకుంటున్నారో వారి ఐడీ గుర్తింపు కార్డును కూడా తీసుకుపోవాలి.రిజర్వేషన్ కౌంటర్ వద్ద దరఖాస్తు అనేది తీసుకుని దాన్ని పూర్తి చేయాలి.

ఎవరు పేరు మీద అయితే మార్చాలనుకుంటున్నామో ఆ వ్యక్తి రేషన్ కార్డు, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, ఫోటో కాపీని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.వీటితో పాటు ఆ వ్యక్తి మీకు ఎలా రిలేషన్ అవుతాడో సంబంధించి ఓ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉంటుంది.

దీంతో అతని పేరు మీద అక్కడున్న రైల్వే అధికారి టికెట్ ను మార్చుతారు.

తాజా వార్తలు