ముక్కు నుంచి రక్తం కారుతుందా ? అయితే, ఇలా చేయండి!

ముక్కు నుండి రక్తం కారే సమస్యను ఎపిస్టాక్సిస్ అని అంటారు.ముక్కు లోపల ఉండే పొరలు చాలా సున్నితంగా ఉంటాయి.

అవి పొడిగా మారినప్పుడు ముక్కు నుండి రక్తం రావటం జరుగుతుంది.ఆ సమయంలో ముక్కు దురద వచ్చి వేలు పెట్టటం వలన నాసికా పొరలకు గాయం అయ్యి రక్తం వస్తుంది.

How To Stop A Nosebleed Fast-How To Stop A Nosebleed Fast-Telugu Health - తె

చాలా మంది ముక్కు నుండి రక్తం రాగానే చాలా భయపడిపోతూ ఉంటారు.కానీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

ఉల్లిపాయ ఉల్లిపాయతో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన రక్త కేశ నాళికలను దృడంగా ఉంచుతుంది.అలాగే ఉల్లిపాయలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం ఉంది.

Advertisement

అందువల్ల ముక్కు నుండి రక్తం వచ్చినప్పుడు ఉల్లిపాయను ముక్కగా కోసి కొంచెం సేపు వాసన చూడాలి.దాంతో ముక్కు నుండి రక్తం కారటం ఆగిపోతుంది.

కొత్తిమీర కొత్తిమీరతో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి.అలాగే కొత్తిమీరలో ఎలర్జీని నివారించే సహజ సిద్ధమైన గుణాలు కూడా ఉన్నాయి.

ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు రెండు లేదా మూడు చుక్కల కొత్తిమీర రసాన్ని ముక్కులో వేస్తె రక్తం కారటం ఆగుతుంది.అలాగే ఎలర్జీ వల్ల ముక్కు పొరలు పగిలే సమస్య కూడా తగ్గిపోతుంది.

తులసి ఒత్తిడికి గురయ్యే నరాలకు మంచి ఉపశమనం కలిగించే ప్రకృతిసిద్ధమైన ఔషధం తులసి.ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు రెండు చుక్కల తులసి రసాన్ని ముక్కులో వేయాలి.

దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే ఉత్త‌మ‌మైన ఇంటి చిట్కాలు మీకోసం!

లేదంటే రెండు ఆకులను నమలవచ్చు.తినే ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకుంటే ముక్కు రంద్రాలు పొడిగా మారకుండా తడిగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు