టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణకు, ఆయన అభిమానులకు కెరీర్ విషయంలో అఖండ సక్సెస్ ఎంతో ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమా తెరకక్కగా అఘోర పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు.
అఘోరా పాత్ర బాలయ్య కోసమే పుట్టిందనే విధంగా బాలకృష్ణ నటన అఖండ సినిమాలో ఉంది.ప్రస్తుతం గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ తో బాలయ్య బిజీగా ఉన్నారు.
ఒకవైపు హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూనే మరోవైపు కెరీర్ విషయంలో బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు.క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో తెరకెక్కిస్తున్న సినిమా ద్వారా అంతకు మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈ సినిమాను పవర్ ఫుల్ కథతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు.
అయితే బాలయ్యకు హిందూపురం ప్రజలు అంటే అమితమైన అభిమానం అనే సంగతి తెలిసిందే.

హిందూపురం ప్రజలు బాలయ్యను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.హిందూపురం టీడీపీ నేతలకు బాలయ్య ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.తాజాగా బాలయ్య మైనారిటీ నేత వివాహానికి హాజరై సందడి చేశారు.ఈ వేడుకలో బాలకృష్ణ సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా కనిపించడం గమనార్హం.

పెళ్లికి హాజరైన సమయంలో అభిమానులు బాలయ్యను గజమాలతో సత్కరించడంతో పాటు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.బాలయ్య భవిష్యత్తు సినిమాలతో కూడా ఘన విజయాలు అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.ఏళ్లు గడుస్తున్నా బాలయ్యకు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గడం లేదు.మాస్ ప్రేక్షకుల్లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సీడెడ్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అఖండ మూవీ ఈ ఏరియాలో కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించింది.4 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడింది.