క‌డుపులో మంట క్ష‌ణాల్లో త‌గ్గాలా..అయితే ఇలా చేయండి!

క‌డుపులో మంట త‌ర‌చూ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ఘాటైన ఆహార‌లు తీసుకున్నా, రుచి బాగుంద‌ని ఓవ‌ర్‌గా తిన్నా, క‌డుపులో ఏమైనా ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డినా, లేట్‌గా ఆహారం తీసుకున్నా, అల్స‌ర్ ఏర్ప‌డినా, వేడి చేసినా, సోడాలు మ‌రియు కూల్ డ్రింక్స్ అతిగా తాగినా, ఫుడ్ జీర్ణం కాక‌పోయినా క‌డుపులో మంట స‌మ‌స్య‌ ఏర్పడుతుంది.

ఇక ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది మందులు వేసుకుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే క్షణాల్లోనే క‌డుపులో మంట‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

క‌డుపులో మంట‌ను నివారించ‌డంలో కీర‌దోస అద్బుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, క‌డుపులో మంట వ‌చ్చిన‌ప్పుడు కీర‌దోసను జ్యూస్‌లా త‌యారు చేసుకుని తాగ‌డం లేదా కీర‌దోస‌ను డైరెక్ట్‌గా తీసుకోవ‌డం చేయాలి.

ఇలా చేస్తే క‌డుపు క్ష‌ణాల్లో చ‌ల్ల‌ప‌డుతుంది.

How To Reduce Stomach Burning Naturally Reduce Stomach Burning, Stomach Burning,
Advertisement
How To Reduce Stomach Burning Naturally Reduce Stomach Burning, Stomach Burning,

కడుపు మంటను సుల‌భంగా మ‌రియు స‌హ‌జంగా త‌గ్గించ‌డంలో అవోకాడో గ్రేట్‌గా ఉప‌యోగ‌‌ప‌డుతుంది.అందువ‌ల్ల, మీకు క‌డుపులో మంట ఏర్ప‌డిన‌ప్పుడు అవోకాడోతో ర‌సం త‌యారు చేసుకుని తీసుకోవ‌డం లేదా అవోకాడోను డైరెక్ట్‌గా తిన‌డం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే పెరుగు, తేనె కాంబినేష‌న్ కూడా క‌డుపు మంట‌ను చ‌ల్లార్చ‌గ‌ల‌దు.

అందుకు ఒక క‌ప్పు పెరుగులో రెండు స్పూన్ల‌ తేనె క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే కడుపు మంట నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందుతారు.

ఒక‌వేళ పెరుగు లేన‌ప్పుడు ఫ్యాట్ లేని గోరు వెచ్చ‌ని పాల‌లో తేనె మిక్స్ చేసి కూడా తీసుకోవ‌చ్చు.ఇలా తీసుకున్నా మంచిది.

How To Reduce Stomach Burning Naturally Reduce Stomach Burning, Stomach Burning,

అర‌టి పండు కూడా త్వ‌ర‌గా క‌డుపు మంట‌ను త‌గ్గించ‌గ‌ల‌దు.క‌డుపులో మంట వ‌చ్చిన‌ప్పుడు మందులు కాకుండా అర‌టి పండు తీసుకోవాలి.ఇలా చేస్తే అర‌టి పండులో ఉండే పలు పోష‌కాలు కడుపులోని ఆమ్లాలను తటస్థీకరించి మంటను నివారిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక ఈ టిప్స్‌తో పాటు స్పైసీ ఫుడ్స్‌‌, ఆల్క‌హాల్‌, సిగ‌రెట్స్‌, సోడాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

Advertisement

How to Reduce Stomach Burning Naturally Reduce Stomach Burning, Stomach Burning, latest news, home remedies, health tips, good health, health, curd ,honey, banana - Telugu Tips, Latest, Reduce Stomach, Stomach