నిమ్మ‌పండ్ల‌తో ఫేస్ క్రీమ్‌.. రోజూ వాడితే మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!

నిమ్మ‌పండ్లు..దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ నిత్యం వీటిని వాడుతుంటారు.

ముఖ్యంగా ఉద‌యాన్నే హాట్ వాట‌ర్‌లో నిమ్మ‌ర‌సం కలుపుకుని తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.రుచికి పుల్ల‌గా ఉన్నా.

నిమ్మ‌పండ్ల‌లో బోలెడ‌న్ని అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

చ‌ర్మ సౌంద‌ర్యానికీ నిమ్మ‌పండ్ల‌ను ఉప‌యోగిస్తుంటారు.అయితే నిమ్మ‌పండ్ల‌తో ఫేస్ క్రీమ్‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.

Advertisement
How To Make Face Cream With Lemon , Face Cream, Lemon, Lemon Face Cream, Latest

మ‌రి ఈ క్రీమ్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దాన్ని యూస్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో శుభ్రంగా క‌డిగి పెట్టుకున్న రెండు నిమ్మ పండ్ల‌ను డైరెక్ట్‌గా వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న నిమ్మ‌పండ్ల‌ను పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకుని.

అప్పుడు వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నుండి ప‌ల్చ‌టి వ‌స్త్రం లేదా స్ట్రైన‌ర్ సాయంతో లెమ‌న్ క్రీమ్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ క్రీమ్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెర జెల్‌, చిటికెడు ఆర్గానిక్ ప‌సుపు, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్, రెండు చుక్క‌లు లెమ‌న్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకుంటే లెమ‌న్ ఫేస్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్లే.

How To Make Face Cream With Lemon , Face Cream, Lemon, Lemon Face Cream, Latest
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు రెండు నుండి మూడు వారాల పాటు నిల్వ ఉంటుంది.ప్ర‌తి రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే ముదురు రంగు మ‌చ్చ‌ల‌న్నీ క్ర‌మంగా తొల‌గిపోతాయి.మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం అవుతుంది.

Advertisement

మ‌రియు వృద్ధాప్య ల‌క్ష‌ణాలు సైతం త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు