వ‌య‌సు పెరిగినా యంగ్‌గా క‌నిపించాలా.. అయితే ఇలా చేయండి?

సాధార‌ణంగా వ‌య‌సు పెరుగుతున్న కొద్ది.ముఖంలో మార్పులు వ‌చ్చేస్తూ ఉంటాయి.

ముఖ్యంగా ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు, చ‌ర్మం సాగ‌డం, డ్రై స్కిన్‌ ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే వాటిని దాచేసి.

యంగ్‌గా క‌నిపించేందుకు చాలా మంది ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుంటే తెగ బాధ ప‌డుతుంటారు.అయితే వ‌య‌సు పెరిగినా యంగ్ లుక్‌లో క‌నిపించ‌వ‌చ్చు.

Advertisement
How To Look Younger Than Age Naturally! Look Younger, Hide Age, Latest News, Bea

అది కూడా న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తిలోనే.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Look Younger Than Age Naturally Look Younger, Hide Age, Latest News, Bea

వ‌య‌సుతో పెరుగుతున్న స‌మ‌యంలో ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు వేధిస్తుంటాయి.వీటికి చెక్ పెట్టాలంటే.ఒక బౌల్‌లో ఎగ్ వైట్ మ‌రియు పెరుగు రెండిటిని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేష్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

How To Look Younger Than Age Naturally Look Younger, Hide Age, Latest News, Bea
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక చాలా మంది నీళ్లు తాగే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు.కానీ, వ‌య‌సు పెరుగుతున్న యంగ్‌గా క‌నిపించాలంటే.ఖ‌చ్చితంగా నీరును ప్ర‌తి రోజు శ‌రీరానికి స‌రిప‌డా తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

అదే స‌మ‌యంలో షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్ల‌కు దూరంగా ఉండాలి.ఎందుకూ అంటే.

షుగర్‌ మూలంగా చ‌ర్మంపై ముడ‌త‌లు మ‌రింత ఎక్కువైపోతాయి.ఏజింగ్‌ను అరికట్టడంలో బీటా కెరోటిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాబ‌ట్టి, బీటా కెరోటిన్ అధికంగా ఉంటే క్యారెట్స్‌, చిలగడదుంపలు, గుమ్మ‌డి, తాజా పండ్లు వంటివి డైట్‌లో చేర్చుకుంటే.య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చు.

అలాగే వ‌య‌సు పెరుగుతున్నా.అందంగా, యంగ్‌గా క‌నిపించాలంటే శ‌రీరానికి నిద్ర చాలా అవ‌స‌రం కాబ‌ట్టి, రోజు క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్రించాలి.ఫ‌లితంగా ముఖంలో కాంతి పెరుగుతుంది.

వయసు క‌న‌ప‌డ‌కుండా చేయ‌డంలో ఆకు కూర‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల‌, డైలీ డైట్‌లో ఏదో ఒక ఆకు కూర ఉండేలా చూసుకోవాలి.

ఇక ఎప్పుడు య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే.ప్ర‌తి రోజు నిద్రించే ముందు ముఖంపై మేక‌ప్ మొత్తం తీపేపి రోజ్ వాట‌ర్ అప్లై చేసుకోవాలి.

దీని వ‌ల్ల ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.

తాజా వార్తలు