ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ వీక్‌గా ఉన్న‌ట్టే.. జాగ్ర‌త్త‌!

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ లేదా రోగ నిరోధ‌క శ‌క్తిఇటీవ‌ల కాలంలో ఏ నోట చూసినా ఈ పేరే వినిపిస్తోంది.

ముఖ్యంగా ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ పెంచుకునేందుకు ప్ర‌జ‌లంద‌రూ నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఎందుకంటే, ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బ‌లంగా ఉంటేనే బ్యాక్టీరియా, వైర‌స్ మ‌రియు ఇత‌ర జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అయితే అంద‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, అస‌లు త‌మ ఇమ్యూనిటీ సిస్ట‌మ్ వీక్‌గా ఉందా? లేదా స్ట్రోంగ్‌గా ఉందా? అన్న‌ది మాత్రం తెలుసుకోలేక‌పోతున్నారు.ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ వీక్‌గా ఉన్న‌ట్టే ఎలా గుర్తించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీనంగా ఉన్నప్పుడు త‌ర‌చూ నీర‌స ప‌డిపోతుంటారు.చిన్న చిన్న ప‌నులు చేసేట‌ప్ప‌టికీ ఓపిక త‌గ్గిపోతుంది.

Advertisement

ఎందుకిలా అంటే ఉన్న ఎనర్జీ ని శరీరం ఇమ్యూన్ సిస్టం కి పంపిస్తూ ఉంటుంది.దాంతో త‌ర‌చూ నీర‌స ప‌డిపోతుంటారు.

ఇలా జ‌రిగితే ఖ‌చ్చితంగా ఇమ్యునిటీ పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

అలాగే ఏ గాయ‌మైనా త్వరగా త‌గ్గ‌కుండా ఇబ్బంది పెడుతుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ వీక్‌గా ఉన్న‌ట్టే అని భావించాలి.అధిక ఒత్తిడి, చికాకు, నిద్ర లేమి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌ర‌చూ ఎదుర్కొన్నా రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీనంగా ఉన్న‌ట్టే అని గుర్తించాలి.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వ‌రం, విరేచనాలు మొదలైన వాటి బారిన త‌ర‌చూ ప‌డుతున్నా ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ వీక్‌గా ఉన్న‌ట్టే.

అలాగే కీళ్ల నొప్పులు బలహీనమైన రోగనిరోధక శక్తికి అతిపెద్ద సంకేతాలు.అందువ‌ల్ల‌, త‌ర‌చూ కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డుతుంటే ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది.ఇక తరచుగా అంటువ్యాధుల బారిన ప‌డుతున్నా రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ట్టే.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

కాబ‌ట్టి, ఇప్పుడు చెప్పుకున్న ల‌క్ష‌ణాలు మీలో ఉంటే పోషకాహారం తినడం, తగినంత నిద్ర పోవ‌డం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం త‌ప్ప‌కుండా చేయాలి.

Advertisement

తాజా వార్తలు