ఇంట్లో ట‌మాటో ఉంటే మొటిమ‌ల‌కు దూరంగా ఉండొచ్చు!

మొటిమ‌లు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో తీవ్రంగా మ‌ద‌న పెట్టే చ‌ర్మ స‌మ‌స్య ఇది.

కాలుష్యం, హార్మోన్స్ లో మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త‌, ఒత్తిడి, మేక‌ప్‌తో నిద్ర పోవ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, చ‌ర్మంపై జిడ్డు ఉత్ప‌త్తి అధికంగా ఉండ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు వ‌స్తుంటాయి.కొంద‌రిలో మ‌రీ ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య ఉంటుంది.

దాంతో మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇంట్లో ట‌మాటో ఉంటే ఎలాంటి మొటిమ‌ల‌నైనా ఈజీగా వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రియు మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా కూడా అడ్డుకోవ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాగా పండిన ఒక ట‌మాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement
How To Get Rid Of Pimples With Tomato Details! Pimples, Tomato, Tomato For Skin,

ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ట‌మాటో జ్యూస్‌కు వ‌న్ టేబుల్ స్పూన్ మ‌జ్జిగను యాడ్ చేయాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి.

డ్రై అయిన త‌ర్వాత నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాదు.

మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా కూడా ఉంటాయి.

How To Get Rid Of Pimples With Tomato Details Pimples, Tomato, Tomato For Skin,

అలాగే హాఫ్ ట‌మాటోను తీసుకుని తేనెలో ముంచి.ముఖానికి పెట్టి స్మూత్‌గా ర‌బ్ చేసుకోవాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు స‌ర్కిల‌ర్ మోష‌న‌ల్‌లో ర‌బ్ చేసుకుని.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఆపై కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేసినా కూడా మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు దూరం అవుతాయి.

Advertisement

మ‌రియు ముఖం ఎల్ల‌ప్పుడూ గ్లోయింగ్‌గా, ఫ్రెష్‌గా మెరుస్తుంది.కాబ‌ట్టి, మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం ఏవేవో క్రీములు వాడే బ‌దులు ఇంట్లోనే ట‌మాటోతో పైన చెప్పిన విధంగా చేస్తే మంచి ఫ‌లితాలు పొందుతారు.

తాజా వార్తలు