తేనెతో నిద్రలేమి ఇక దూరం..!

ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి( Insomnia ) అనేది ఎందరినో బాధిస్తున్న సమస్య.

నిద్రలేమి కారణంగా మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే నిద్రలేమిని వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.

అయితే వంటింట్లో ఉండే కొన్ని ఔషధాలు నిద్రలేమి సమస్యను దూరం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి.తేనె ( Honey ) కూడా ఆ కోవకే చెందుతుంది.

నిద్రలేమి సమస్యను పరిష్కరించడంలో తేనె ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది.మరి ఇంతకీ తేనెను నిద్రలేమికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప‌దండి.

మీరు ప్రశాంతంగా నిద్ర పోవాలి అనుకుంటే పడుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను నేరుగా తీసుకోండి లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు( Milk ) తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క( Cinnamon ) పొడి కలిపి సేవించండి.తేనె లోని గ్లూకోజ్ మెదడుకు శాంతిని అందిస్తుంది.

Advertisement
How To Get Rid Of Insomnia With Honey Details, Insomnia, Honey, Honey Benefits,

నిద్రలేమి సమస్యను దూరం చేసి శరీరాన్ని విశ్రాంతి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది.నిద్ర నాణ్యతను మెరుగు పరచడానికి కూడా తేనె సహాయపడుతుంది.

How To Get Rid Of Insomnia With Honey Details, Insomnia, Honey, Honey Benefits,

అలాగే తేనెతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు శరీరంలో రోగ‌ నిరోధక శక్తిని పెంచుతాయి.గొంతు నొప్పి మరియు దగ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలోనూ ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది.

How To Get Rid Of Insomnia With Honey Details, Insomnia, Honey, Honey Benefits,

ఆహారాన్ని సులభంగా జీర్ణమవడానికి తేనె సహాయపడుతుంది.ఉదయాన్నే వేడి నీటితో తేనె క‌లిపి తాగితే గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.తేనెను గాయాలపై రాసినప్పుడు బ్యాక్టీరియా నివారించి త్వరగా మానేందుకు తోడ్ప‌డుతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తేనె తక్షణ శక్తిని అందిస్తుంది, కాబట్టి వ్యాయామం చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన‌డంలో సందేహ‌మే లేదు.

Advertisement

తాజా వార్తలు