పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..

ఇప్పుడు అడవుల్లోనే కాదు ప్రజలు నివసించే నగరాల్లో కూడా చిరుతలు, పులులు కనిపిస్తున్నాయి.సాధారణంగా అడవుల్లో( Forests ) ఉండే ఈ వన్యప్రాణులు ఊళ్లల్లోకి, పట్టణాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి.

 Leopard Invades A House And Had Confrontation With Pitbull Viral Video Details,-TeluguStop.com

అడవుల్లో ఆహారం తగ్గిపోవడం లేదా అడవుల విస్తీర్ణం తగ్గిపోవడమే దీనికి కారణం అని నిపుణులు అంటున్నారు.దీనితో అడవుల నరికివేత, పట్టణీకరణ గురించి చర్చ మొదలైంది.

భవనాలు, మనుషులు నివసించడానికి స్థలాలు చేయడానికి అడవుల్ని నరికేస్తున్నారు.జంతువులు మనుషుల స్థలాల్లోకి రావడం లేదు, మనుషులే జంతువుల సహజ నివాసాలను ఆక్రమిస్తున్నారని చాలామంది అంటున్నారు.

అడవులు కుంచించుకుపోవడం, ఆహారం కొరవడటంతో చిరుతలు, పులుల్లాంటి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో( Viral Video ) ఈ ఆందోళనలను మరింత పెంచింది.సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియోలో ఒక పులి పిల్ల( Tiger Cub ) ఒక ఇంట్లోకి రావడం కనిపిస్తుంది.ఆ పులి ఎలా లోపలికి వచ్చిందో, ఇది ఎక్కడ జరిగిందో తెలియదు.వీడియోలో ఆ ఇంటి పెంపుడు కుక్క( Pet Dog ) పెద్దగా మొరిగి పులిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది.

పులి వెళ్ళిపోయినా మళ్ళీ కొన్నిసార్లు తిరిగి వస్తుంది.చివరికి కుక్క మొరగడం వల్ల ఇంట్లో వాళ్లు లేచి పులిని తరిమేస్తారు.

అది ఒక పులి పిల్ల మాత్రమే కాబట్టి భయపడింది.లేదంటే కుక్కని కచ్చితంగా చంపేసి దానిని నోట కరుచుకొని వెళ్లిపోయేది

కుక్క ధైర్యం ఆ కుటుంబాన్ని ప్రమాదం నుంచి కాపాడింది. “డిస్కవర్ వైల్డ్ పావ్స్” అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో, కుక్క ధైర్యాన్ని, వన్యప్రాణులు మనుషుల ప్రాంతాల్లోకి వస్తున్న సమస్యను హైలైట్ చేస్తుంది.అడవులు తగ్గిపోవడం వల్ల జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వీడియో చుస్తే ఎవరికైనా భయం వేస్తుంది, కుక్క లేకపోతే ఏమి అయ్యేదో అని! మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హీరో డాగ్ పులిని ఎలా తరిమేసిందో కింద వీడియోలో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube