ముఖంపై నల్లటి మచ్చలు పోవడం లేదా.. బెల్లంతో ఇలా చేశారంటే 2 వారాల్లో క్లియర్ స్కిన్ ను పొందుతారు!

ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్న చర్మంపై అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు తీవ్ర అసహనానికి గురి చేస్తాయి.

నల్లటి మచ్చలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.

ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.ఈ క్రమంలోనే నల్లటి మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.

బెల్లం( Jaggery ) ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.నిత్యం చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా బెల్లాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Advertisement

ముఖ్యంగా చర్మంపై నల్లటి మచ్చలను వదిలించడానికి బెల్లం అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు లేదా నాలుగు బాగా పండిన బొప్పాయి పండు ముక్క‌లు( Papaya ) వేసి ప్యూరీలా గ్రౌండ్ చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ ( Jaggery powder )ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బొప్పాయి పండు ప్యూరీ, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె మరియు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మంపై ఎంతటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.కేవలం రెండు వారాల్లోనే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అమెరికా : వర్జీనియా డెమొక్రాటిక్ ప్రైమరీలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు
త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

Advertisement

మరియు స్పాట్ లెసన్స్ స్కిన్ ను పొందుతారు.

తాజా వార్తలు