మిగిలిపోయిన అన్నంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలాగంటే?

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.మెరిసే చర్మం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.మిగిలిపోయిన అన్నంతో( Leftover Rice ) చాలా సులభంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

సాధారణంగా మిగిలిపోయిన అన్నాన్ని కొందరు డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.మరికొందరు వేడి చేసి తర్వాత రోజు తింటూ ఉంటారు.

అయితే మిగిలిపోయిన రైస్ తో చర్మానికి మెరుగులు పెట్టవచ్చు.ముఖ్యంగా మిగిలిపోయిన రైస్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

How To Get Glowing Skin With Leftover Rice Details, Glowing Skin, Leftover Rice
Advertisement
How To Get Glowing Skin With Leftover Rice Details, Glowing Skin, Leftover Rice

అందుకోసం ముందుగా ఒక చిన్న టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మిగిలిపోయిన రైస్ వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

How To Get Glowing Skin With Leftover Rice Details, Glowing Skin, Leftover Rice

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ ఫేస్ మాస్క్( Face Mask ) వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ప్రధానంగా చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.

ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మంపై ఎటువంటి మొండి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అంతేకాదు ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

Advertisement

మరియు స్కిన్ స్మూత్ గా సైతం మారుతుంది.కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

తాజా వార్తలు