ప్రస్తుత కాలంలో చాలామంది చిన్నారులు రీల్స్, వీడియోలు ఇంకా రకరకాల కంటెంట్లను స్మార్ట్ ఫోన్లలో వీక్షిస్తున్నారు.కొంతమంది చిన్నారులు( Children ) ఫోన్ ఇవ్వగానే మొదటగా చేసే పని యూట్యూబ్( Youtube ) ఓపెన్ చేయడం.
అయితే కొన్ని సందర్భాల్లో వారి ప్రమేయం లేకుండానే యూట్యూబ్ లో రకరకాల అభ్యంతరకర వీడియోలు వస్తుంటాయి.
చిన్నారులు యూట్యూబ్లో కామెడీ కంటెంట్లు లాంటివి చూస్తే పర్వాలేదు కానీ అసభ్యకర వీడియోలు చూస్తే ప్రమాదమే కాబట్టి స్మార్ట్ ఫోన్ లో చిన్నారులకు అసభ్యకర వీడియోలు కనిపించకుండా చేసేందుకు ఒక మార్గం ఉంది.
స్మార్ట్ ఫోన్ లో( Smartphone ) ఒక చిన్న సెట్టింగ్ ద్వారా చిన్నారులకు అసభ్యకర వీడియోలు కనిపించకుండా చెక్ పెట్టవచ్చు.ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ను సెలెక్ట్ చేసుకోవాలి.అక్కడ సెట్టింగ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని జనరల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.తర్వాత కిందకి కాస్త స్క్రోల్ చేస్తే.అక్కడ రిస్ట్రిక్టెడ్ మోడ్( Restricted Mode ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఆ ఆప్షను సెలెక్ట్ చేయాలి.ఇక సెట్టింగ్ ను ఆన్ చేసుకుంటే యూట్యూబ్లో వచ్చే ఫీడ్ లో అసభ్యకర వీడియోలు కనిపించవు.
ఇక చిన్న పిల్లలు ఎంత సేపు యూట్యూబ్ ఉపయోగించిన ఎలాంటి అసభ్యకర వీడియోలు పిల్లల కంటికి కనిపించే అవకాశం ఉండదు.
ప్రస్తుతం కొన్ని పేరెంటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.ఆ యాప్స్ ద్వారా చిన్నారులు ఫోన్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు ఎలాంటి కంటెంట్ ను కంట్రోల్ చేయొచ్చు అనే విషయాలను కూడా మీ కంట్రోల్ లోనే చేసుకోవచ్చు.