Pawan Kalyan K Vishwanath : పవన్ కళ్యాణ్ తో కే విశ్వనాథ్ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్…( Pawan Kalyan ) ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించాయి.

 How Pawan Kalyan Missed Movie With Legendary Director K Vishwanath-TeluguStop.com

ఆయన ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలను అయితే అందుకున్నాడు.ఇక అందులో భాగంగానే ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ అయిన కె.

విశ్వనాథ్( K Vishwanath ) డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’( Akkada Ammayi Ikkada Abbayi ) సినిమా చేశాడు.ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.

ఇక ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం లాంటి సినిమాలు చేశాడు.ఇక అదే సమయంలో కే విశ్వనాథ్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.

అది ఆర్ట్ సినిమా( Art Movie ) కథ కావడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా మీద ఆసక్తి చూపించాడు.కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు.

ఇక దాంతో వీళ్ళ కాంబో లో ఆ సినిమా అనేది అలా మిస్సయింది.ఇక గత సంవత్సరం కె విశ్వనాథ్ గారు అనారోగ్య కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ డైరెక్షన్ లో ‘ఓజి ‘ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ఏపీ పాలిటిక్స్ లో కూడా తను కీలకపాత్రను పోషిస్తున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube