నాగోబా నూతన దేవాలయ ప్రారంభం ఎలా జరిగిందంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలోనీ కేస్లాపూర్ లో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయం ప్రారంభోత్సవం ఆదివారం ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది.

ఈ దేవాలయానికి మెస్రం వంశీయులు దాదాపు 5 కోట్ల సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించి ఈ దేవాలయ ప్రారంభ ఉత్సవాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ దేవాలయానికి ఆదివాస సంప్రదాయం ప్రకారం తెల్లవారు జామున నాలుగు గంటల 30 నిమిషములకు కోడప వినాయకరావు, ఆత్రం పురుషోత్తం మహారాజ్ ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టాపన కళాశాల ఆవిష్కరణ కూడా జరిగింది.మొదటిగా వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాల తో విగ్రహాలను శుద్ధి చేశారు.

ఆ తర్వాత మెస్రం వంశీయులు హోమం నిర్వహించారు.ఈ సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా మెస్రం వంశీయులు చేస్తూ వస్తున్నారు.

How Nagoba New Temple Was Started , Nagoba Temple ,nagoba New Temple , Keslapur

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి ఈ ప్రారంభ ఉత్సవాల పూజల్లో పాల్గొన్నారు.ఆ తరువాత ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖ నాయక్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాలయంలో ప్రత్యేక పూజలను చేశారు.వారిని మెస్రం వంశీయులు ఎంతో ఘనంగా సన్మానించారు.

Advertisement
How Nagoba New Temple Was Started , Nagoba Temple ,Nagoba New Temple , Keslapur

ఈ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, ఆదివాసులు భారీ సంఖ్యలో తరలి రావడం విశేషం.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెస్రం యువకులు ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు