ఎంత సంపాదించిన దరిద్రం వెంటాడుతుందా... ఈ 3 అలవాట్లు మానుకోవాలి?

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరి ఎంతో సుఖసంతోషాలతో ఉండాలని భావిస్తారు.

ఇలా సంతోషంగా ఉండటం కోసం నిరంతరం కష్టపడి డబ్బు సంపాదిస్తారు.

ఇలా డబ్బు సంపాదించి వారి కలలు నెరవేర్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ కలలు మాత్రం కలగానే మిగిలి పోతాయి.ఎందుకంటే కొందరికి ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవదు.

ఇలా సంపాదించిన ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండకపోతే అందుకు గల కారణం మన అలవాట్లేనని చెప్పవచ్చు.మరి ఆ అలవాటు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆలయానికి వెళ్ళినప్పుడు మనం చాలా మంది కొబ్బరికాయ కొట్టేది చూస్తాము.అయితే ఈ కొబ్బరికాయ కొట్టే సమయంలో కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెట్టి దేవుడికి కొడతారు.

Advertisement
How Much You Work But Money Does Have Avoid These 3 Habits Money, Work, Worshi

ఇలా కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరడం ఏమో కానీ అష్టదరిద్రాలు మనల్ని వెంటాడుతాయి.అందుకే టెంకాయ కొట్టేటప్పుడు కుంకుమ పెట్టకూడదు.

అదేవిధంగా మన ఇంట్లో ఎప్పటి నుంచో మన పెద్దలు ఉపయోగిస్తున్న వస్తువులను వాడుతాము.అయితే సడన్ గా మనకి ఏదైనా చెడు జరిగితే ఆ వస్తువుల వల్ల చెడు జరిగిందని ఈ పద్ధతులు పాటించడం వల్ల చెడు జరిగిందని భావిస్తారు ఈ అలవాటు కూడా దరిద్రానికి సంకేతమే.

How Much You Work But Money Does Have Avoid These 3 Habits Money, Work, Worshi

ఇకపోతే చాలామంది కుర్చీలో కూర్చున్న సమయంలో కాళ్లు ఊపుతూ కూర్చుంటారు.ఈ అలవాటు చాలామందికి ఉంటుంది.అయితే ఇలా కాళ్లు ఊపుతూ కూర్చోవడం చెడుకు సంకేతమని, ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపుతూ కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు మనం కుర్చీలో కూర్చున్నప్పుడు రెండు కాళ్లు నేలకు తాకేలా ఉండాలి.

ఈ అలవాట్లను కనుక మానుకుంటే మన జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు